ఫైనల్లో తమిళనాడు జట్లు | Tamilnadu team entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో తమిళనాడు జట్లు

Published Wed, Mar 12 2014 12:11 AM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

Tamilnadu team entered in finals

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ ఇంటర్ స్టేట్ క్యారమ్ టోర్నమెంట్‌లో తమిళనాడు పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. అలాగే పురుషుల విభాగంలో మహారాష్ట్ర, మహిళల విభాగంలో బీహార్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి.

 విశాఖపట్నంలోని కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో మూడో రోజు మంగళవారం జరిగిన పురుషుల టీమ్ విభాగం సెమీఫైనల్లో తమిళనాడు జట్టు 2-1స్కోరుతో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర జట్టు 3-0తో విదర్భ జట్టుపై గెలిచింది. మహిళల టీమ్ విభాగం సెమీఫైనల్లో తమిళనాడు 2-1తో చండీగఢ్‌పై, బీహార్ 2-1తో మహారాష్ట్రపై గెలిచాయి.
 
 ఇన్‌స్టిట్యూషన్స్ సెమీఫైనల్స్ ఫలితాలు
 పురుషుల టీమ్ విభాగం: పీఎస్‌పీబీ 3-0తో ఏఐఈఎస్‌సీబీపై, జైన్ ఇరిగేషన్ 2-1తో ఆర్‌బీఐపై గెలిచాయి. మహిళల టీమ్ విభాగం: ఎల్‌ఐసీ 3-0తో సీఏజీపై, పీఎస్‌పీబీ 3-0తో ఆర్‌బీఐపై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement