ఆర్‌బీఐపై సీసీఓబీ గెలుపు | CCOB won with RBI team foot ball league | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐపై సీసీఓబీ గెలుపు

Published Fri, Jun 13 2014 1:20 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

CCOB won with RBI team foot ball league

 సి- డివిజన్ ఫుట్‌బాల్ లీగ్
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ సి- డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ) జూనియర్ జట్టు 5-0 గోల్స్‌తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జట్టుపై ఘన విజయం సాధించింది.
 
 విజయనగర్ ప్లేగ్రౌండ్‌లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీసీఓబీ ఆటగాళ్లు దూకుడుగా ఆడి ఐదు గోల్స్ నమోదు చేశారు. సీసీఓబీ తరఫున మోషిమ్, జౌషీన్, ఎం.డి.ఇలియాస్, ఇంతియాజ్, ఒమర్‌లు తలా ఒక గోల్ చేశారు. తిరుమలగిరి విలేజ్ మైదానంలో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో సికింద్రాబాద్ బ్లూ(ఎ) జట్టు 2-1తో సికింద్రాబాద్ (బి) జట్టుపై గెలిచింది. శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో తిరుమలగిరి ఎయిర్ ఇండియా జట్టుతో సికింద్రాబాద్ (బి) జట్టు తలపడుతుంది. విజయనగర్ కాలనీ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో సీసీఓబీ (సబ్ జూనియర్) జట్టుతో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు ఢీకొంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement