సౌత్ జోన్ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు శుభారంభం చేయగా ఆంధ్ర జట్టు ఓడిపోయింది.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సౌత్ జోన్ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు శుభారంభం చేయగా ఆంధ్ర జట్టు ఓడిపోయింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 40-12 స్కోరుతో పుదుచ్చేరి జట్టుపై విజయం సాధించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 19-5తో ఆధిక్యాన్ని సాధించింది. హైదరాబాద్ జట్టులో నిఖిల్, జి.మల్లేష్ చక్కటి ప్రతిభను కనబర్చారు.
పురుషుల లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 52-15తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్టుతో ఓటమి చవిచూసింది. మహిళల విభాగం లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 38-17తో కేరళపై గెలిచింది. పోటీలను భారత కబడ్డీ సమాఖ్య(కేఎఫ్‌ఐ) అధ్యక్షురాలు డాక్టర్ మృదుల భదూరియా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు జనార్ధన్ గెహ్లాట్, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి దానం నాగేందర్, హైదరాబాద్ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.వి.ప్రభాకర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.