ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ ట్రోఫీ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ బాలికల టైటిల్‌ను చేజిక్కించుకుంది. సెయింట్ పాయిస్ హైస్కూల్ రెండో స్థానం పొందగా, మెరీడియన్ హైస్కూల్ జట్టుకు మూడో స్థానం దక్కింది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గెలుచుకుంది. ఇందులో మహాత్మా గాంధీ స్మారక (ఎంజీఎం) హైస్కూల్ రెండో స్థానం, ఆల్ సెయింట్ హైస్కూల్ మూడో స్థానం పొందాయి. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 47-32తో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రామ్‌నగర్)పై విజయం సాధించింది.
సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 35-18తో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టుపై, సెయింట్ పాయిస్ 26-18తో మెరీడియన్ హైస్కూల్ (బంజారాహిల్స్)పై గెలిచాయి. బాలుర టైటిల్ పోరులో ఓక్రిడ్జ్ స్కూల్ జట్టు 47-28తో ఎంజీఎం హైస్కూల్ జట్టుపై గెలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రదర్ ప్రతాప్‌రెడ్డి విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.15 వేలు, రన్నరప్‌కు రూ. 7 వేలు, మూడో స్థానం పొందిన జట్లకు రూ. 5 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ పాల్గొన్నారు.
బాలికల చాంప్ ఫ్యూచర్ కిడ్స్
Published Thu, Jul 17 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement
Advertisement