ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో ఆర్మీ గ్రీన్, ఓఎన్‌జీసీ జట్లు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో ముందంజలో ఉన్నాయి.
నారాయణగూడ వైఎంసీఏలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు 79-55 పాయింట్ల తేడాతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆర్‌సీఎఫ్ 36-33తో ఆర్మీ గ్రీన్ జట్టుపై ఆధిక్యాన్ని సాధించింది. ఆర్మీ జట్టులో అభిషేక్ 34, రమేష్ కుమార్ 19, సామ్యా రంజన్ 8 పాయింట్లు నమోదు చేసి విజయాన్ని అందించారు. ఆర్‌సీఎఫ్ జట్టులో రంజన్ శర్మ, ఖాన్‌లు చెరో 14 పాయింట్లు, హర్షవర్ధన్ 12 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో ఓఎన్‌జీసీ జట్టు 76-48తో ఏఓసీ జట్టుపై గెలిచింది. ఇతర లీగ్ పోటీల్లో ఆర్‌సీఎఫ్ 77-73తో కేఎస్‌ఈబీపై, ఆర్మీ గ్రీన్ 84-61తో హైదరాబాద్ వైఎంసీఏపై గెలిచాయి.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఆర్మీ గ్రీన్ జయభేరి
Published Fri, Jun 13 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement