basket ball tournment
-
బాలికల చాంప్ ఫ్యూచర్ కిడ్స్
ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ ట్రోఫీ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ బాలికల టైటిల్‌ను చేజిక్కించుకుంది. సెయింట్ పాయిస్ హైస్కూల్ రెండో స్థానం పొందగా, మెరీడియన్ హైస్కూల్ జట్టుకు మూడో స్థానం దక్కింది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గెలుచుకుంది. ఇందులో మహాత్మా గాంధీ స్మారక (ఎంజీఎం) హైస్కూల్ రెండో స్థానం, ఆల్ సెయింట్ హైస్కూల్ మూడో స్థానం పొందాయి. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 47-32తో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రామ్‌నగర్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 35-18తో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టుపై, సెయింట్ పాయిస్ 26-18తో మెరీడియన్ హైస్కూల్ (బంజారాహిల్స్)పై గెలిచాయి. బాలుర టైటిల్ పోరులో ఓక్రిడ్జ్ స్కూల్ జట్టు 47-28తో ఎంజీఎం హైస్కూల్ జట్టుపై గెలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రదర్ ప్రతాప్‌రెడ్డి విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.15 వేలు, రన్నరప్‌కు రూ. 7 వేలు, మూడో స్థానం పొందిన జట్లకు రూ. 5 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ పాల్గొన్నారు. -
ఏఓసీ సెంటర్‌పై ఆర్మీ గెలుపు
ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో ఆర్మీ, ఓఎన్జీసీ జట్ల హవా కొనసాగుతోంది. నారాయణగూడలోని వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్మీ జట్టు 72-46 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ జట్టుపై విజయం సాధించింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్‌లకుగాను ఆర్మీ జట్టు మూడింట్లో గెలుపొంది.. ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఓఎన్జీసీ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్మీ జట్టులో రమేష్ కుమార్ 20, సౌమ్యా రంజన్18, శశి 12 చొప్పున పాయింట్లు చేశారు. ఏఓసీ సెంటర్ జట్టులో జలీల్ 15, ఇర్ఫాన్ 15, సంజయ్ 10 పాయింట్లు చేశారు. ఇక మరో లీగ్ మ్యాచ్‌లో ఓఎన్జీసీ జట్టు 87-66తో కేఎస్ఈబీ జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏఓసీ సెంటర్ 84-73తో హైదరాబాద్ వైఎంసీఏపై, ఆర్మీ గ్రీన్ 79-55తో ఆర్‌సీఎఫ్‌పై నెగ్గాయి. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఆర్మీ గ్రీన్ జయభేరి
ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో ఆర్మీ గ్రీన్, ఓఎన్జీసీ జట్లు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. నారాయణగూడ వైఎంసీఏలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు 79-55 పాయింట్ల తేడాతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆర్సీఎఫ్ 36-33తో ఆర్మీ గ్రీన్ జట్టుపై ఆధిక్యాన్ని సాధించింది. ఆర్మీ జట్టులో అభిషేక్ 34, రమేష్ కుమార్ 19, సామ్యా రంజన్ 8 పాయింట్లు నమోదు చేసి విజయాన్ని అందించారు. ఆర్సీఎఫ్ జట్టులో రంజన్ శర్మ, ఖాన్లు చెరో 14 పాయింట్లు, హర్షవర్ధన్ 12 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో ఓఎన్జీసీ జట్టు 76-48తో ఏఓసీ జట్టుపై గెలిచింది. ఇతర లీగ్ పోటీల్లో ఆర్సీఎఫ్ 77-73తో కేఎస్ఈబీపై, ఆర్మీ గ్రీన్ 84-61తో హైదరాబాద్ వైఎంసీఏపై గెలిచాయి. -
చత్తీస్‌గఢ్‌పై కేఎస్ఈబీ గెలుపు
ఆలిండియా ఇన్విటేషన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో కేరళ స్టేట్ విద్యుత్ బోర్డు (కేఎస్ఈబీ) జట్టు 78-61 పాయింట్ల తేడాతో చత్తీస్‌గఢ్ జట్టుపై విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 35-33 పాయింట్లతో ఆధిక్యాన్ని సాధించింది. కేరళ జట్టులో పి.ఎస్.జీనా 37, స్టెఫీ నిక్సన్ 15, రోష్ని థామస్ 8 పాయింట్లు చేశారు. చత్తీస్‌గఢ్ జట్టులో శరన్‌జీత్ కౌర్ 28, సంగీత కౌర్ 17, రియా వర్మ 9 పాయింట్లతో రాణించారు. ఇతర పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు 78-65తో ఈస్టర్న్ రైల్వే జట్టుపై, చత్తీస్‌గఢ్ జట్టు 47-37తో సెంట్రల్రైల్వే జట్టుపై నెగ్గాయి. -
6 నుంచి జాతీయ ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఈనెల 6 నుంచి 14 వరకు నారాయణగూడలోని వైఎం సీఏలో నిర్వహిస్తున్నట్లు వైఎంసీఏ చైర్మన్ బి.జె.వినయ్ స్వరూప్ తెలిపారు. సెక్రటరీ లియోనార్డ్, కన్వీనర్ నార్మన్ ఐజాక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్.ప్రేమ్ కుమార్‌తో కలిసి వినయ్ వివరాలను వెల్లడించారు. దాదాపు 40 మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో తొలిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్ లాకింగ్ సర్ఫేస్ మ్యాట్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల విభాగంలో పోటీలు రౌండ్ రాబిన్ పద్ధతిలో 6 నుంచి 10 వరకు, పురుషుల విభాగంలో లీగ్ పద్ధతిలో 10 నుంచి 14 వరకు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. పురుషుల జట్టు విజేతకు రూ. 60 వేలు, రన్నరప్‌కు రూ. 40 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30 వేల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు. మహిళల విభాగంలో వరుసగా రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేల నగదు బహుమతులు ఇస్తారు. మహిళల జట్లు: సౌత్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, చత్తీస్‌గఢ్, కేరళ విద్యుత్ జట్లు; ఫురుషుల జట్లు: ఆర్మీ, ఓఎన్జీసీ, వైఎంసీఏ, కేరళ విద్యుత్ బోర్డు, ఏఓసీ, ఐఓబీ, ఆర్సీఎఫ్, కొచిన్ కస్టమ్స్. -
డెలాయిట్ శుభారంభం
కార్పొరేట్ బాస్కెట్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: డీసీ కార్పొరేట్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో డెలాయిట్ జట్టు శుభారంభం చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డెలాయిట్ 92-68 పాయింట్ల తేడాతో యునెటైడ్ హెల్త్ కేర్‌ను చిత్తు చేసింది. డెలాయిట్ తరఫున ఇర్ఫాన్ 26, హాగ్స్ 20, అనిల్ 19 పాయింట్లు స్కోర్ చేశారు. యూహెచ్‌సీ ఆటగాళ్లలో డెన్నిస్ ఒక్కడే 41 పాయింట్లు సాధించగా... వివేకన్ 10 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో జెన్‌ప్యాక్ట్ 95-72 స్కోరుతో విర్టుసాపై ఘన విజయం సాధించింది. జెన్ప్యాక్స్ ఆటగాళ్లు సాయి 25, సునీల్ 21, శ్రీకర్ 16, రోహన్ 15 పాయింట్లు చేయగా... విర్టుసా తరఫున సిద్ధార్థ్ 30, సతీశ్ 28, కోటి 12 పాయింట్లు సాధించారు. ఇతర మ్యాచుల్లో హెచ్ఎస్బీసీ 49-33తో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌పై గెలుపొందింది. హెచ్ఎస్బీసీ ఆటగాళ్లలో అరవింద్, శరత్ చంద్ర చెరో 12 పాయింట్లు సాధించగా, టాటా తరఫున ప్రాన్షు 10, విజయ్, అభిజ్ఞ్యాన్ చెరో 6 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో గూగుల్ 47-10 స్కోరుతో ఏడీపీని ఓడించింది. గూగుల్ తరఫున కృషన్ 13, భవత్ 9, ఆయుష్ 7 పాయింట్లు చేయగా, ఏడీపీ ఆటగాళ్లలో గర్వ్ 6, విశాల్ 4 పాయింట్లు చేశారు. -
విజేత చెన్నై లయోలా
జింఖానా, న్యూస్‌లైన్ : ఫాదర్ బాలయ్య స్మారక క్రీడల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో చెన్నై లయోలా జట్టు విజేతగా నిలిచింది. లయోలా కాలేజిలో బుధవారం జరిగిన ఫైనల్లో చెన్నై లయోలా 80-65తో లయోలా అకాడమీ (హైదరాబాద్)పై గెలిచింది. ఆట ప్రారంభంలో చెన్నై లయోలా కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు గణేశ్, ఉదయ్, డేవిడ్ ప్రతిఘటించారు. అయినా మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 35-32తో చెన్నై లయోలా ముందంజలో నిలిచింది. అనంతరం విజృంభించిన చెన్నై లయోలా ఆటగాళ్లు కార్తికేయన్ (23), ఆంటో (23) చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును ముందంజలో ఉంచేందుకు దోహదపడ్డారు. చివరి వరకు లయోలా అకాడమీ క్రీడాకారులు జోస్ (15), చంద్రహాస్ (14) ఎదుర్కునేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో లయోలా అకాడమీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో ఏవీ కాలేజి 56-45తో సెయింట్ మార్టిన్స్‌పై గెలుపొందింది. సాక్రెడ్ హార్ట్‌కు వాలీబాల్ టైటిల్ వాలీబాల్ ఫైనల్లో సాక్రెడ్ హార్ట్ (తిరుపత్తూర్) జట్టు 25-22, 25-21, 21-25, 25-20తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో జమాల్ మహ్మద్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ సాక్రెడ్ హార్ట్ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడో సెట్లో జమాల్ మహ్మద్ ఆటగాళ్లు సాక్రెడ్ హార్ట్ జట్టును కంగుతినిపించారు. అనంతరం నాలుగో సెట్లో తేరుకున్న సాక్రెడ్ హార్ట్ చాకచక్యంగా వ్యవహరించి టైటిల్‌ను దక్కించుకుంది. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో లయోలా అకాడమీ 24-25, 18-25, 19-25, 25-15, 15-10తో ఆంధ్రా లయోలా కాలేజిపై గెలిచింది. విజేతలకు గ్రేట్ స్పోర్ట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
విజేతలు స్పర్శ్, కృష్ణా జట్లు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ స్పర్శ్ జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీమ్ టైటిల్‌ను కృష్ణా జిల్లా జట్టు గెలుచుకుంది. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ స్పర్శ్ జట్టు 17-13 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. స్పర్శ్ ఆటగాడు శ్రీనాథ్ దూకుడుగా ఆడి 6 పాయింట్లను నమోదు చేశాడు. వైఎంసీఏ జట్టులో రోహిత్ చక్కటి ఆటతీరును ప్రదర్శించి 8 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. మహిళల విభాగం ఫైనల్లో కృష్ణా జిల్లా జట్టు 12-11 పాయింట్ల తేడాతో లయోలా-ఎ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ టోర్నీలో విజేత జట్టుకు మూడు వేల రూపాయలు, రన్నర్స్ జట్టుకు రెండు వేల రూపాయల నగదు పురస్కారం లభించాయి. ఈ పోటీల విజేతలకు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు ఎల్.సి. ఉమాకాంత్ బహుమతులను అందజేశారు. -
లయోలా అకాడమీ హవా
జింఖానా, న్యూస్‌లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ జట్టు 59-25తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై గెలుపొందింది. లయోలా కాలేజిలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లయోలా అకాడమీ ఆటగాళ్లు బాషా (17), ఉదయ్ (14), గణేశ్ (12) రాణించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే లయోలా అకాడమీ 18 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు జమాల్ మహ్మద్ క్రీడాకారులు ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మ్యాచ్ అఖరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించిన లయోలా ఆటగాళ్లు జట్టును 34 పాయింట్ల ఆధిక్యంలో నిలిపారు. మరో మ్యాచ్‌లో లయోలా (చెన్నై) 81-57తో ఎన్సీ లా కాలేజి (నాందేడ్)పై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో లయోలా 49-43తో ముందంజలో ఉంది. అనంతరం లయోలా జట్టులో ముకుంద్ (23), ఆంటో (17) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. ఎన్సీ లా కాలేజి క్రీడాకారుల్లో రంజిత్ (14), అమల్ (10) రాణించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఏవీ కాలేజి (హైదరాబాద్): 69 (శామ్ 19, విజయ్ 12, సాయి 14); ఆర్జేజే (ముంబై): 57 (ప్రఫుల్ 15, అకాంక్ష్ 10). -
24 నుంచి రిపబ్లిక్‌డే బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రిపబ్లిక్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ నారాయణగూడ వైఎంసీఏలో ఈనెల 24 నుంచి జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో స్కూల్స్, కాలేజి, క్లబ్ జట్లు పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను కోసం నారాయణగూడ వైఎంసీఏ సీనియర్ సెక్రటరీ లియొనార్డ్ మైరాన్(27564670) లేదా కళ్యాణ్‌రాజ్(99661-70343)లను సంప్రదించవచ్చు. 26న సీసీఓబీ వన్డే బాస్కెట్‌బాల్ టోర్నీ సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ బాస్కెట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో వన్డే బాస్కెట్‌బాల్ టోర్నీమెంట్ ఈనెల 26న సిటీ గవర్నమెంట్ కాలేజి బాస్కెట్‌బాల్ కోర్టులో నిర్వహించనున్నారు. ఈటోర్నీలో పాల్గొనేందుకు మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ఆటగాళ్లు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల జిల్లా జట్లు తమ ఎంట్రీలను ఈనెల 25లోగా పంపించాలి. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.హనుమంతరావు(93930-04825)ను సంప్రదించవచ్చు. -
ఏవీ కాలేజి జట్టుకు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను ఆంధ్ర విద్యాలయం (ఏవీ) కాలేజి జట్టు చేజిక్కించుకుంది. సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిటీ గవర్నమెంట్ కాలేజి బాస్కెట్‌బాల్ కోర్టులో మంగళవారం జరిగిన ఫైనల్లో ఏవీ కాలేజి జట్టు 103-95 పాయింట్ల తేడాతో లయోలా అకాడమీ జట్టుపై ఘన విజయం సాధించింది. ప్రధమార్ధభాగం ముగిసే సమయానికి ఏవీ కాలేజి జట్టు 45-43 పాయింట్లతో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఏవీ కాలేజి జట్టులో సాయి కృష్ణ దూకుడుగా ఆడి అత్యధికంగా 27 పాయింట్లను నమోదు చేయగా, విజయ్ 20, శామ్సన్ 15 పాయింట్లు స్కోరు చేశారు. లయోలా అకాడమీ జట్టులో గణేష్ 24, ఉదయ్ 23, చంద్రహాసన్ 11 పాయింట్లతో రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
సెమీస్‌లో ఎస్సీ రైల్వే, వీపీజీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వీపీజీ ఓపెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్), విక్టరీ ప్లేగ్రౌండ్స్ (వి.పి.జి) జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. దీంతోపాటు ఏఓసీ సెంటర్, ఆర్టిలరీ సెంటర్ జట్లు కూడా సెమీస్‌కు చేరాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్ బాస్కెట్‌బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎస్సీ రైల్వే జట్టు 72-52తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఎస్సీ రైల్వే జట్టు 38-30తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రైల్వే జట్టులో నిహాల్ 16, నవీన్ 10 పాయింట్లను నమోదు చేశారు. వైఎంసీఏ జట్టులో సాయి 19, రోహిత్ 15 పాయింట్లతో రాణించారు. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వీపీజీ జట్టు 65-46తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టుపై గెలిచింది. వీపీజీ జట్టులో గణేష్ 17, ప్రసాద్ 14 పాయింట్లను చేశారు. ఎస్బీఐ జట్టులో పి.బి.శ్రీనాథ్ 17 పాయింట్లు చేయగా హరిప్రసాద్ 10 పాయింట్లు చేయడం జరిగింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఏఓసీ సెంటర్ జట్టు 67-46తో సికింద్రాబాద్ క్లబ్ జట్టుపై, ఆర్టిలరీ సెంటర్ జట్టు 53-25తో హెచ్‌సీయూపై నెగ్గాయి. -
సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జయభేరి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బాలికల లీగ్ పోటీల్లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్లు విజయాలను సాధించాయి. బేగంపేట్‌లోని హెచ్‌పీఎస్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 30-22 పాయింట్ల తేడాతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) జట్టుపై విజయం సాధించింది. ప్రథమార్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 16-12తో స్పల్ప ఆధిక్యాన్ని సాధించింది. సెయింట్ ఆన్స్ జట్టులో నిఖిత 18, శారద 10 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. హెచ్‌పీఎస్ జట్టులో రష్మిత 13, రమ్య 5 పాయింట్లు చేశారు. ఇతర లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి 26-25తో సెయింట్ ఆన్స్ స్కూల్‌పై గెలిచింది. చిరెక్ పబ్లిక్ స్కూల్ 32-24తో హోలీ ప్యామిలీ స్కూల్‌పై, సెయింట్ పాయిస్ స్కూల్ 41-29తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గెలిచాయి. బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 34-29తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ 32-16తో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్ పై నెగ్గాయి. -
క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో సెయింట్ ఆండ్రూస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆండ్రూస్ పబ్లిక్ స్కూల్ బాస్కెట్‌బాల్ కోర్టులో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు గురువారం ప్రిక్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్ 23-13 పాయింట్ల తేడాతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్)పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్ 11-3తో ఆధిక్యాన్ని సాధించింది. జియాన్ 12, యాష్ 7 పాయింట్లను నమోదు చేశారు. డీపీఎస్ జట్టులో రహీమ్, అరోన్ చెరో నాలుగు పాయింట్లను సాధించారు. రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో హెచ్‌పీఎస్ జట్టు 13-2 పాయింట్ల తేడాతో సెయింట్ మైకేల్స్ స్కూల్ జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 19-6తో కాల్ పబ్లిక్ స్కూల్ జట్టుపై, మెరిడియన్ స్కూల్ జట్టు 25-10తో ఇండస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై గెలిచాయి. బాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ 6-2తో ఎంజీఎం స్కూల్‌పై, సెయింట్ ఆంథోనీస్ స్కూల్ 16-6తో కాల్ పబ్లిక్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 18-8తో డాన్ బోస్కో స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 12-2తో సెయింట్ మైకేల్స్ స్కూల్‌పై, సెయింట్ పియోస్ 10-2తో ఎంజీఎమ్ స్కూల్‌పై నెగ్గాయి.