ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రిపబ్లిక్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ నారాయణగూడ వైఎంసీఏలో ఈనెల 24 నుంచి జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో స్కూల్స్, కాలేజి, క్లబ్ జట్లు పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను కోసం నారాయణగూడ వైఎంసీఏ సీనియర్ సెక్రటరీ లియొనార్డ్ మైరాన్(27564670) లేదా కళ్యాణ్‌రాజ్(99661-70343)లను సంప్రదించవచ్చు.
26న సీసీఓబీ వన్డే బాస్కెట్‌బాల్ టోర్నీ
సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ బాస్కెట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో వన్డే బాస్కెట్‌బాల్ టోర్నీమెంట్ ఈనెల 26న సిటీ గవర్నమెంట్ కాలేజి బాస్కెట్‌బాల్ కోర్టులో నిర్వహించనున్నారు. ఈటోర్నీలో పాల్గొనేందుకు మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ఆటగాళ్లు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల జిల్లా జట్లు తమ ఎంట్రీలను ఈనెల 25లోగా పంపించాలి. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.హనుమంతరావు(93930-04825)ను సంప్రదించవచ్చు.
24 నుంచి రిపబ్లిక్‌డే బాస్కెట్‌బాల్ టోర్నీ
Published Wed, Jan 22 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement