ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వీపీజీ ఓపెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్), విక్టరీ ప్లేగ్రౌండ్స్ (వి.పి.జి) జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. దీంతోపాటు ఏఓసీ సెంటర్, ఆర్టిలరీ సెంటర్ జట్లు కూడా సెమీస్‌కు చేరాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్ బాస్కెట్‌బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎస్‌సీ రైల్వే జట్టు 72-52తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై ఘన విజయం సాధించింది.
తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఎస్‌సీ రైల్వే జట్టు 38-30తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రైల్వే జట్టులో నిహాల్ 16, నవీన్ 10 పాయింట్లను నమోదు చేశారు. వైఎంసీఏ జట్టులో సాయి 19, రోహిత్ 15 పాయింట్లతో రాణించారు. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వీపీజీ జట్టు 65-46తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జట్టుపై గెలిచింది. వీపీజీ జట్టులో గణేష్ 17, ప్రసాద్ 14 పాయింట్లను చేశారు. ఎస్‌బీఐ జట్టులో పి.బి.శ్రీనాథ్ 17 పాయింట్లు చేయగా హరిప్రసాద్ 10 పాయింట్లు చేయడం జరిగింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఏఓసీ సెంటర్ జట్టు 67-46తో సికింద్రాబాద్ క్లబ్ జట్టుపై, ఆర్టిలరీ సెంటర్ జట్టు 53-25తో హెచ్‌సీయూపై నెగ్గాయి.
సెమీస్‌లో ఎస్‌సీ రైల్వే, వీపీజీ
Published Sat, Dec 14 2013 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement