చత్తీస్‌గఢ్‌పై కేఎస్‌ఈబీ గెలుపు | KSEB won with chhattisgarh team | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌పై కేఎస్‌ఈబీ గెలుపు

Published Sun, Jun 8 2014 1:35 AM | Last Updated on Tue, May 29 2018 11:15 AM

KSEB won with chhattisgarh team

ఆలిండియా ఇన్విటేషన్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో మహిళల విభాగంలో కేరళ స్టేట్ విద్యుత్ బోర్డు (కేఎస్‌ఈబీ) జట్టు 78-61 పాయింట్ల తేడాతో చత్తీస్‌గఢ్ జట్టుపై విజయం సాధించింది.
 
  గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 35-33 పాయింట్లతో ఆధిక్యాన్ని సాధించింది. కేరళ జట్టులో పి.ఎస్.జీనా 37, స్టెఫీ నిక్సన్ 15, రోష్ని థామస్ 8 పాయింట్లు చేశారు. చత్తీస్‌గఢ్ జట్టులో శరన్‌జీత్ కౌర్ 28, సంగీత కౌర్ 17, రియా వర్మ 9 పాయింట్లతో రాణించారు. ఇతర పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు 78-65తో ఈస్టర్న్ రైల్వే జట్టుపై, చత్తీస్‌గఢ్ జట్టు 47-37తో సెంట్రల్‌రైల్వే జట్టుపై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement