క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్ | In Quarters Saint Andrews | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్

Published Fri, Aug 9 2013 12:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్

క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్  బాలుర విభాగంలో సెయింట్ ఆండ్రూస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి.
 
  సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆండ్రూస్ పబ్లిక్ స్కూల్ బాస్కెట్‌బాల్ కోర్టులో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు గురువారం ప్రిక్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్ 23-13 పాయింట్ల తేడాతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్)పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్ 11-3తో ఆధిక్యాన్ని సాధించింది. జియాన్ 12, యాష్ 7 పాయింట్లను నమోదు చేశారు. డీపీఎస్ జట్టులో రహీమ్, అరోన్ చెరో నాలుగు పాయింట్లను సాధించారు. రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో హెచ్‌పీఎస్ జట్టు 13-2 పాయింట్ల తేడాతో సెయింట్ మైకేల్స్ స్కూల్ జట్టుపై గెలిచింది.
 
  ఇతర మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 19-6తో కాల్ పబ్లిక్ స్కూల్ జట్టుపై,  మెరిడియన్ స్కూల్ జట్టు 25-10తో ఇండస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై గెలిచాయి. బాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ 6-2తో ఎంజీఎం స్కూల్‌పై, సెయింట్ ఆంథోనీస్ స్కూల్ 16-6తో కాల్ పబ్లిక్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 18-8తో డాన్ బోస్కో స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 12-2తో సెయింట్ మైకేల్స్ స్కూల్‌పై, సెయింట్ పియోస్ 10-2తో ఎంజీఎమ్ స్కూల్‌పై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement