Saint Andrews
-
ఆర్యన్, అభిషేక్ సెంచరీలు
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: సెయింట్ ఆండ్రూస్ బ్యాట్స్‌మెన్ ఆర్యన్ కృష్ణ (136 బంతుల్లో 136; 18 ఫోర్లు), అభిషేక్ పరాడ్కర్ (110 బంతుల్లో 143; 27 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా న్యూస్టార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 279 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ముదస్సిర్ 5, హసన్ 3 వికెట్లు తీశారు. అనంతరం న్యూస్టార్ జట్టు 29.3 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌తో జరిగిన మరోమ్యాచ్‌లో కిషోర్‌సన్‌స జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిషోర్‌సన్‌స తొలుత 30 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటవగా... ఆల్‌సెయింట్స్ స్కూల్ 28.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కిషోర్‌సన్‌స బౌలర్ వినయ్ కుమార్ 5 వికెట్లతో రాణించాడు. -
ఓవరాల్ చాంప్ సెయింట్ ఆండ్రూస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 22 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సీఆర్పీఎఫ్ స్కూల్‌కు ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. మొత్తం ఈ పోటీల్లో 17 స్కూళ్లకు చెందిన 300 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హెచ్‌డీఏఏ అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మాజీ అథ్లెట్ లావణ్య రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందించారు. శుక్రవారం జరిగిన వివిధ పోటీల్లో విజేతల వివరాలు షాట్‌పుట్ (సీనియర్ బాలురు) 1. డానీ (10. 92మీ. జాన్సన్ గ్రామర్ స్కూల్), 2. సన్ని (10.02 మీ., సీఆర్పీఎఫ్), 3. ప్రభాకర్ సింగ్ (8.81 మీ., సీఆర్పీఎఫ్). జూనియర్ బాలురు 1. అజీజ్ (9.75 మీ., ఎంఎస్బీ స్కూల్), 2. ముకేశ్ (9.33 మీ., సీఆర్పీఎఫ్), 3. సిద్ధాంత్ (9.08మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్). సీనియర్ బాలికలు 1. త్రిష (7.10మీ., సీఆర్పీఎఫ్), 2. సారుు నేహా (7.09మీ., సెయింట్ ట్ ఆండ్రూస్), 3. శ్రేయ (6.58మీ., సెయింట్ మైకెల్స్). జూనియర్ బాలికలు 1. అహిగేల్ (6.94మీ., సెయింట్ ఆండ్రూస్), 2. దామిని (6.32మీ., సీఆర్పీఎఫ్), జ్యోతి (5.22మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్). లాంగ్ జంప్ (సీనియర్ బాలురు) 1.సాత్విక్ (డీఆర్ఎస్, 4.91మీ.), 2. సన్ని (సీఆర్పీఎఫ్, 4.89మీ.), 3. భార్గవ్ (సెయింట్ ఆండ్రూస్, 4.66మీ.). జూనియర్ బాలురు 1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 4.76మీ.), 2.వైష్ణవ్ రాజ్ (భవన్స, 4.48మీ.), 3. డి.సాత్విక్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్, 4.18మీ.) సీనియర్ బాలికలు 1. ఎన్. అపూర్వ (భవన్స, 3.98మీ.), 2. సాక్షి (సీఆర్పీఎఫ్, 3.96మీ.), 3. శరణ్య (భవన్స, 3.95మీ.). జూనియర్ బాలికలు 1. నిత్య (లిటిల్ ఫ్లవర్, 3.67మీ.), 2. లహరి (సీఆర్పీఎఫ్, 3.54మీ.), 3. భవాణి (భవన్స, 3.51మీ.) 100మీ.పరుగు (సీనియర్ బాలురు) 1.రామకృష్ణ (భవన్స, 12.1సె.), 2. నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 3. అలెన్ (సెరుుంట్ ఆండ్రూస్, 12.07సె). సీనియర్ బాలికలు 1. కృతిక (సెయింట్ఆండ్రూస్, 13.8 సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 14.1సె.), 3. సాక్షి (సీఆర్పీఎఫ్, 14.4సె.) జూనియర్ బాలురు 1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 2.నితిన్ (సీఆర్పీఎఫ్, 12.6సె.), 3. సొహైల్ (సీఆర్పీఎఫ్, 12.9సె.) జూనియర్ బాలికలు 1. పారుల్ (సెయింట్ ఆండ్రూస్, 14.4సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 15.3సె., 3. చిత్ర (సీఆర్పీఎఫ్, 15.6సె.) 200మీ. పరుగు (సీనియర్ బాలురు) 1.నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 25.3సె.), 2. ఆదిత్య (భవన్స, 25.6సె.), 3. రామకృష్ణ (భవన్స, 25.9సె.) జూనియర్ బాలురు 1. నితిన్ (సీఆర్పీఎఫ్, 27.5సె.), 2. హర్షవర్ధన్ (లిటిల్ ఫ్లవర్, 27.9సె.), 3. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 28.2సె.) జూనియర్ బాలికలు 1.నిత్య (సెయింట్ ఆండ్రూస్, 32.8సె.), 2. ప్రియాంక (సెయింట్ ఆండ్రూస్, 33.1సె.), 3. చిత్ర (సీఆర్పీఎఫ్, 33.4సె.) సీనియర్ బాలికలు 1. సుహాలి (సెయింట్ ఆండ్రూస్, 31.2 సె.), 2. కృతిక (సెయింట్ ఆండ్రూస్, 31.8సె.), 3. సౌమ్య (లిటిల్ ఫ్లవర్, 32.1సె.) -
రేపటి నుంచి ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ ఆండ్రూస్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నీ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్, పల్లవి మోడల్ స్కూల్, డాన్ బాస్కో, ఎంఎస్బీ, జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, మార్నింగ్ స్టార్, సెయింట్ మైకేల్ స్కూల్ జట్లు పాల్గోనున్నాయి. టోర్నీలో జట్టు ప్రదర్శనకే కాక వ్యక్తిగతంగా సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి అత్యంత విలువైన ఆటగాడిగా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నీలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ తరఫున భారత మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్ ముఖ్య కార్యనిర్వాహకుడిగా వ్యవహరించనున్నారు. ఖోఖో శిక్షణా శిబిరం... ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 31 నుంచి మహిళల ఖోఖో శిక్షణా శిబిరం నిర్వహించనుంది. ఈ శిబిరం కోఠి ఉమెన్స్ కాలేజీలో జరగనుంది. ఆసక్తి గలవారు ఆరోజు సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలి. మరిన్ని వివరాలకు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్‌ను సంప్రదించాలి. -
సెయింట్ ఆండ్రూస్ ముందంజ
జింఖానా, న్యూస్‌లైన్: దేవసియా ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ బాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో ముందంజలో ఉంది. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం మూడో రౌండ్లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 6 పాయింట్లతో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. పల్లవి మోడల్ స్కూల్ జట్టు 4 పాయింట్లతో ఎన్‌ఎస్‌కేకే జట్టుపై నెగ్గగా, మెరిడియన్, సాధు వాస్వని జట్లు చెరో 3 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయి. బాలుర విభాగం మూడో రౌండ్ ముగిసే సమయానికి చిరెక్ పబ్లిక్ స్కూల్, సాధు వాస్వని జట్లు ఆధిక్యంలో ఉన్నాయి. సాధు వాస్వని 6 పాయింట్లతో హెచ్‌పీఎస్ గెలవగా, చిరెక్ పబ్లిక్ స్కూల్ 6 పాయింట్లతో మెరిడియన్ జట్టును ఓడించింది. సెయింట్ పీటర్స్ హైస్కూల్ 5 పాయింట్లతో సెయింట్ ఆండ్రూస్ ‘బి’పై, సెయింట్ ఆండ్రూస్ ‘ఎ’ జట్టు 5 పాయింట్లతో సెయింట్ ఆండ్రూస్ ‘సి’జట్టుపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో సెయింట్ ఆండ్రూస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆండ్రూస్ పబ్లిక్ స్కూల్ బాస్కెట్‌బాల్ కోర్టులో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు గురువారం ప్రిక్వార్టర్స్‌లో సెయింట్ ఆండ్రూస్ 23-13 పాయింట్ల తేడాతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్)పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్ 11-3తో ఆధిక్యాన్ని సాధించింది. జియాన్ 12, యాష్ 7 పాయింట్లను నమోదు చేశారు. డీపీఎస్ జట్టులో రహీమ్, అరోన్ చెరో నాలుగు పాయింట్లను సాధించారు. రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో హెచ్‌పీఎస్ జట్టు 13-2 పాయింట్ల తేడాతో సెయింట్ మైకేల్స్ స్కూల్ జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 19-6తో కాల్ పబ్లిక్ స్కూల్ జట్టుపై, మెరిడియన్ స్కూల్ జట్టు 25-10తో ఇండస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై గెలిచాయి. బాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ 6-2తో ఎంజీఎం స్కూల్‌పై, సెయింట్ ఆంథోనీస్ స్కూల్ 16-6తో కాల్ పబ్లిక్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 18-8తో డాన్ బోస్కో స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 12-2తో సెయింట్ మైకేల్స్ స్కూల్‌పై, సెయింట్ పియోస్ 10-2తో ఎంజీఎమ్ స్కూల్‌పై నెగ్గాయి.