ఆర్యన్, అభిషేక్ సెంచరీలు | aryan, abhishek got centuries for saint andrews | Sakshi
Sakshi News home page

ఆర్యన్, అభిషేక్ సెంచరీలు

Published Tue, Oct 25 2016 10:53 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

aryan, abhishek got centuries for saint andrews

ఎ-డివిజన్ వన్డే లీగ్  


 సాక్షి, హైదరాబాద్: సెయింట్ ఆండ్రూస్ బ్యాట్స్‌మెన్ ఆర్యన్ కృష్ణ (136 బంతుల్లో 136; 18 ఫోర్లు), అభిషేక్ పరాడ్కర్ (110 బంతుల్లో 143; 27 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా న్యూస్టార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 279 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ముదస్సిర్ 5, హసన్ 3 వికెట్లు తీశారు.

 

అనంతరం న్యూస్టార్ జట్టు 29.3 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌తో జరిగిన మరోమ్యాచ్‌లో కిషోర్‌సన్‌‌స జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. కిషోర్‌సన్‌‌స తొలుత 30 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటవగా... ఆల్‌సెయింట్స్ స్కూల్ 28.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కిషోర్‌సన్‌‌స బౌలర్ వినయ్ కుమార్ 5 వికెట్లతో రాణించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement