శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ త్రోబాల్ టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ త్రోబాల్ టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ముషీరాబాద్ ప్లేగ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-1 (25-20, 23-25, 25-07, 25-20)తో లంకపై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లోనూ దుమ్మురేపారు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించారు.
మహ్మద్ అక్విద్ 15, అశోక్ 12 పాయింట్లు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. లంక తరఫున మర్హిగల్లా 10, బండారా 7 పాయింట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర మహిళల శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నీ అర్గనైజింగ్ చైర్మన్ ఎస్.కె.గుప్తా, అధ్యక్షుడు డి. శ్రీధర్, సెక్రటరీ ఎం.బి.నర్సింహులు పాల్గొన్నారు.
భారత జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి