హాకీ చాంప్ ఏజీ ఆఫీస్ | hockey champion A.G office | Sakshi
Sakshi News home page

హాకీ చాంప్ ఏజీ ఆఫీస్

May 26 2014 12:10 AM | Updated on Sep 2 2017 7:50 AM

హెచ్ హెచ్ ఇన్విటేషన్ సిక్స్-ఏ-సైడ్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్ (ఏజీఓఆర్‌సీ) జట్టు కైవసం చేసుకుంది.

 హెచ్‌హెచ్ ఇన్విటేషన్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్ హెచ్ ఇన్విటేషన్ సిక్స్-ఏ-సైడ్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్ (ఏజీఓఆర్‌సీ) జట్టు కైవసం చేసుకుంది.  హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో  ఏజీ ఆఫీస్ జట్టు 4-3 గోల్స్‌తో ఇన్‌క మ్‌ట్యాక్స్ ఆఫీస్ జట్టుపై విజయం సాధించింది.
 
  ఏజీ ఆఫీస్ జట్టు తరఫున సుమన్ రెండు గోల్స్ చేయగా, సాయికిరణ్, వాసు తలా ఒక గోల్ చేశాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీస్ జట్టులో సంజీవ్, సమీర్, అజయ్ వర్మలు చెరో గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు హెచ్‌హెచ్ అధ్యక్షుడు, ఐఏఎస్ అధికారి డాక్టర్ జయేష్ రంజన్   ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement