hockey hyderabad
-
హాకీ చాంప్ ఏజీ ఆఫీస్
హెచ్‌హెచ్ ఇన్విటేషన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్ హెచ్ ఇన్విటేషన్ సిక్స్-ఏ-సైడ్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్ (ఏజీఓఆర్‌సీ) జట్టు కైవసం చేసుకుంది. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఏజీ ఆఫీస్ జట్టు 4-3 గోల్స్‌తో ఇన్క మ్‌ట్యాక్స్ ఆఫీస్ జట్టుపై విజయం సాధించింది. ఏజీ ఆఫీస్ జట్టు తరఫున సుమన్ రెండు గోల్స్ చేయగా, సాయికిరణ్, వాసు తలా ఒక గోల్ చేశాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీస్ జట్టులో సంజీవ్, సమీర్, అజయ్ వర్మలు చెరో గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు హెచ్‌హెచ్ అధ్యక్షుడు, ఐఏఎస్ అధికారి డాక్టర్ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఏపీ పోలీస్ జట్టుకు హాకీ టైటిల్
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: రాష్ట్ర సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ (ఏపీపీ) జట్టు దక్కించుకుంది. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్లో ఏపీ పోలీస్ జట్టు 2-0 స్కోరుతో రసూల్‌పురా క్లబ్‌పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఇరు జట్ల ఆటగాళ్ల స్కోరును సాధించడంలో విఫలమయ్యారు. ఏపీ పోలీస్ జట్టుకు 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సురేష్ గోల్‌గా మలిచాడు. దీంతో ఏపీ పోలీస్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఏపీపీ జట్టు ఆటగాడు రామ్‌కిరణ్ 52 వ నిమిషంలో ప్రత్యర్థి జట్టు డిఫెండర్లను చేధించి అద్బుతంగా చేసిన గోల్‌తో 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రసూల్‌పురా క్లబ్ జట్టుకు 10 పెనాల్టీ కార్నర్లు లభించనప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. విజేతగా నిలిచిన ఏపీ పోలీస్ జట్టుకు రూ.20 వేల నగదు బహుమతి లభించగా రూ.15 వేలు రన్నరప్ జట్టుకు లభించాయి. విజేతలకు సుచిత్ర ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ వై.కిరణ్ ట్రోఫీలను అందజేశారు. -
కేవీఎస్ ‘డబుల్’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్లో బాలబాలికల టీమ్ టైటిల్స్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) స్కూల్ గెలుచుకుంది. (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన బాలికల విభాగం ఫైనల్లో కేవీఎస్ 6-0తో ఐ.వి.వై లీగ్ అకాడమీ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవీఎస్ స్కూల్‌కు చెందిన గీతా హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. శృతి, సోను చెరో గోల్ సాధించారు. బాలుర విభాగం ఫైనల్లో కేవీఎస్ జట్టు 2-0తో బాలంరాయి హైస్కూల్ టీమ్‌ను ఓడించింది. కేవీ స్కూల్ జట్టు తరఫున అభిమన్యు, వంశీ గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో హెచ్‌హెచ్ అధ్యక్షుడు జయేష్ రంజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ స్కూల్ హాకీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్ మంగళవారం జింఖానా మైదానంలో ప్రారంభమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) సహకారంతో హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుంది. హెచ్‌హెచ్ ఏర్పాటయ్యాక అధికారికంగా నిర్వహిస్తున్న తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా టోర్నీని ప్రారంభించారు. ట్రిపుల్ ఒలింపియన్, హెచ్‌హెచ్ కార్యదర్శి ఎన్.ముకేశ్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. బాలుర విభాగంలో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో 12 జట్లు పోటీ పడుతుండగా, బాలికల విభాగంలో లీగ్ ప్రాతిపదికగా 5 జట్లు తలపడుతున్నాయి. ఇందులో రాణించిన ఆటగాళ్లను జాతీయ స్థాయిలో జరిగే కె.డి. సింగ్‌బాబు అండర్-14 టోర్నీకి ఎంపిక చేస్తారు. -
18న హాకీ అంపైర్స్ పరీక్ష
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హాకీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 18న హాకీ అంపైర్స్ పరీక్ష జరుగుతుంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు లోపున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని క్రీడాకారులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అర్హులని హెచ్‌హెచ్ తెలిపింది. అభ్యర్థికి జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలని, వేదిక ఎక్కడనేది వారికి ఎస్సెమ్మెస్ చేయడం జరుగుతుందని పేర్కొంది. అంతర్జాతీయ ఎఫ్ఐహెచ్ అంపైర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో పాల్గొనే ఆసక్తి గల వారు తమ పేర్ల నమోదు కోసం డి.వేణుగోపాల్(98498-25979) లేదా, ఈ.ఎస్.సంజీవ్ కుమార్(99896-21121)లను సంప్రదించవచ్చు.