ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి క్రీడల్లో లయోలా అకాడమీ జట్లు బాస్కెట్‌బాల్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాయి. ఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీతో చెన్నై లయోలా అకాడమీ అమీతుమీ తేల్చుకోనుంది. లయోలా అకాడమీ మైదానంలో మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్ సెమీఫైనల్లో లయోలా జట్టు 75-70తో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది.
లయోలా జట్టులో గణేష్ 28, ఉదయ్ 15, చంద్రహాసన్ 12 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఎ.వి.కాలేజి జట్టులో బాలాజి 22, సాయి 18 పాయింట్లు చేశారు. రెండో సెమీఫైనల్లో చెన్నై లయోలా అకాడమీ జట్టు 78-41తో సెయింట్ మార్టిన్స్ కాలేజి జట్టుపై గెలిచింది. చెన్నై లయోలా జట్టులో హరీశ్ 38, వినోద్ 13 పాయింట్లు చేయగా, సెయింట్ మార్టిన్స్ జట్టు తరఫున సంతోష్ 12, విశాల్ 10 పాయింట్లు చేశారు.
వాలీబాల్‌లో ఓడిన లయోలా
వాలీబాల్ టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీ జట్టు ఓడిపోయింది. జమాల్ మహ్మద్, సెక్రెడ్ హార్ట్ జట్లు ఫైనల్లోకి చేరాయి. తొలి సెమీఫైనల్లో జమాల్ మహ్మద్ కాలేజి 25-20, 25-17, 25-20తో లయోలా జట్టుపై గెలిచింది. రెండో సెమీఫైనల్లో సెక్రెడ్ హార్ట్ జట్టు 3-1 గేమ్‌ల తేడాతో విజయవాడ లయోలా అకాడమీ జట్టుపై నెగ్గింది.
ఫైనల్లో లయోలా అకాడమీ
Published Tue, Feb 11 2014 11:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement