loyola team
-
ముందుగానే స్పందిస్తే మరణాలు తగ్గించొచ్చు
న్యూయార్క్: కరోనా వైరస్ వంటి అంటువ్యాధుల సమయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 1918–19 సంవత్సరాల్లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అమెరికాలోని కొన్ని నగరాల్లో ముందుగానే అప్రమత్తమై చేపట్టిన నిర్బంధ, నివారణ చర్యల కారణంగా మరణాలు తగ్గినట్లు లయోలా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ బారినపడి 5 కోట్ల మంది చనిపోగా అమెరికాలో 6.75 లక్షల మంది బలయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్, కన్సాస్ సిటీ, మిల్వాకీ నగరాలు చేపట్టిన.. పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాలపై నిషేధం, కఠినమైన ఐసోలేషన్ విధానాలు, పరిశుభ్రత పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ‘ఈ చర్యలు వ్యాధి తీవ్రతను 30 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి. ఆలస్యంగా స్పందించిన/ ముందు జాగ్రత్తలు తక్కువగా తీసుకున్న నగరాలతో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నగరాల్లో మరణాల రేటు గరిష్ట స్థాయిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. మొత్తం మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిశోధన ఫలితాలు తాజాగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సైటోపాథాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘ఇలాంటి కఠినచర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ, అది తప్పు అని మా అధ్యయనంలో తేలింది’అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘1918లో అమెరికాలో పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, జనం ఎక్కువగా గుమికూడటం ఎక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచం నేడు చాలా మారింది. అయినప్పటికీ, వందేళ్ల క్రితం తీసుకున్న నివారణ చర్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకూ అనుసరణీయాలే’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేదు వాషింగ్టన్: కరోనా ముప్పు వృద్ధులకే అధికమన్న వాదనలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడే అవకాశాలు తక్కువని తేల్చిచెప్పింది. సహజంగా వృద్ధుల్లో అరోగ్యవంతులు అంతంతమాత్రమే కాబట్టి అలాంటి వారే బలయ్యే ప్రమాదం ఉందంది. -
లయోలా డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో లయోలా జట్లు విజేతగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 47-21తో భవాన్స్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. ఆట ప్రారంభం నుంచి లయోలా అకాడమీ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఒక దశలో లయోలా 23-6తో ముందంజలో ఉంది. అయితే భవాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 37-10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో భవాన్స్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ చివరకు అది విఫలమైంది. లయోలా క్రీడాకారులు గణేశ్ (19), ఉదయ్ (11), జోస్ (11) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. భవాన్స్ జట్టులో హేమంత్ (7), రోహ న్ (5), అనిల్ (4) రాణించారు. మహిళల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 46-37తో ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల (జీసీపీఈ)పై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 24-21తో లయోలా ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారిణులు అలవోకగా దూసుకె ళ్లారు. అనంతరం తేరుకున్న జీసీపీఈ క్రీడాకారిణిలు చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. లయోలా క్రీడాకారిణులు అక్షిత (15), మౌనిక (10), స్నేహ (7), రమా (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో మహిళల విభాగంలో సెయింట్ మార్టిన్స్ 39-34తో సీవీఎస్ఆర్ జట్టుపై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఏవీ కాలేజి 59-40తో సెయింట్ మార్టిన్స్‌పై నెగ్గింది. టోర్నీలో బెస్ట్ మెన్ ప్లేయర్ అవార్డును భవాన్స్ ఆటగాడు రోహన్ సొంతం చేసుకోగా... బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును లయోలా క్రీడాకారిణి రమా మిశ్రా దక్కించుకుంది. బెస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ టైటిల్‌ను భవ్య (జీసీపీఈ) గెలుచుకుంది. లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ కాసిమిర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ఫైనల్లో లయోలా అకాడమీ
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి క్రీడల్లో లయోలా అకాడమీ జట్లు బాస్కెట్‌బాల్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాయి. ఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీతో చెన్నై లయోలా అకాడమీ అమీతుమీ తేల్చుకోనుంది. లయోలా అకాడమీ మైదానంలో మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్ సెమీఫైనల్లో లయోలా జట్టు 75-70తో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా జట్టులో గణేష్ 28, ఉదయ్ 15, చంద్రహాసన్ 12 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఎ.వి.కాలేజి జట్టులో బాలాజి 22, సాయి 18 పాయింట్లు చేశారు. రెండో సెమీఫైనల్లో చెన్నై లయోలా అకాడమీ జట్టు 78-41తో సెయింట్ మార్టిన్స్ కాలేజి జట్టుపై గెలిచింది. చెన్నై లయోలా జట్టులో హరీశ్ 38, వినోద్ 13 పాయింట్లు చేయగా, సెయింట్ మార్టిన్స్ జట్టు తరఫున సంతోష్ 12, విశాల్ 10 పాయింట్లు చేశారు. వాలీబాల్‌లో ఓడిన లయోలా వాలీబాల్ టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ లయోలా అకాడమీ జట్టు ఓడిపోయింది. జమాల్ మహ్మద్, సెక్రెడ్ హార్ట్ జట్లు ఫైనల్లోకి చేరాయి. తొలి సెమీఫైనల్లో జమాల్ మహ్మద్ కాలేజి 25-20, 25-17, 25-20తో లయోలా జట్టుపై గెలిచింది. రెండో సెమీఫైనల్లో సెక్రెడ్ హార్ట్ జట్టు 3-1 గేమ్‌ల తేడాతో విజయవాడ లయోలా అకాడమీ జట్టుపై నెగ్గింది.