ఫుట్‌బాల్ రెఫరీల శిక్షణా శిబిరం ప్రారంభం | Football referees start of training camp | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ రెఫరీల శిక్షణా శిబిరం ప్రారంభం

Published Sat, Apr 5 2014 12:09 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Football referees start of training camp

జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రెఫరీల సంఘం ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ రెఫరీలకు శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలోని ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం (ఏపీఎఫ్‌ఏ) కార్యాలయంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

 ఏపీఎఫ్‌ఏ అధ్యక్షుడు, ఐఏఎస్ అధికారి డాక్టర్ మహ్మద్ అలీ రఫత్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎఫ్‌ఏ కార్యదర్శి ఫల్గుణ తదితరులు హాజరయ్యారు. ఏపీ రెఫరీల సంఘం అధ్యక్షుడు సలీమ్, కార్యదర్శి మహ్మద్ హషమ్‌ల పర్యవేక్షణలో ఈ శిబిరం జరుగుతోంది. జంట నగరాల నుంచి దాదాపు 50 మంది ఈ శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement