ఫుట్‌బాల్ టోర్నీ విజేత తార్నాక క్లబ్ | Tarnaka club won foot ball tournment | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ టోర్నీ విజేత తార్నాక క్లబ్

Published Sat, Feb 22 2014 12:03 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Tarnaka club won foot ball tournment

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెవెన్-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను తార్నాక ఫుట్‌బాల్ క్లబ్ జట్టు కైవసం చేసుకుంది. ఓల్డ్ అల్వాల్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో తార్నాక క్లబ్ జట్టు 7-1 స్కోరుతో  కుకి ఫుట్‌బాల్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది.
 
 తార్నాక క్లబ్ జట్టు తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. తార్నాక క్లబ్ జట్టు ఆటగాడు రియాజ్ హ్యాట్రిక్ నమోదు చేయడం ఈ మ్యాచ్‌లోని విశేషం. ఈ పోటీల విజేతలకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు జాన్ విక్టర్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రేమ్ కుమార్, భీమ్‌రావులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement