ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఏస్టర్ మైండ్స్ రాష్ట్ర ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అండర్-12 బాలికల సింగిల్స్ టైటిల్‌ను పి.నిధి కైవసం చేసుకుంది. అండర్-12 బాలుర సింగిల్స్ టైటిల్‌ను రాహుల్ చందన గెల్చుకున్నాడు.
ఏసీఈ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని ఉమానగర్‌లో మంగళవారం జరిగిన అండర్-12 బాలికల సింగిల్స్ ఫైనల్లో నిధి 9-3 స్కోరుతో సృజనపై విజయం సాధించింది. అండర్-12 బాలుర సింగిల్స్ ఫైనల్లో రాహుల్ చందన 9-2తో హర్షిత్ కొసరాజుపై గెలిచాడు. అండర్-10 బాలికల సింగిల్స్ ఫైనల్లో సూర్య బన్సాల్ 9-4తో ముకుంద్ రెడ్డిపై గెలిచాడు. అండర్-10 బాలికల సింగిల్స్ ఫైనల్లో సంజన 9-7తో సృజనపై గెలిచింది.
ఫైనల్స్ ఫలితాలు:
అండర్-14 బాలికల సింగిల్స్: 1.పి.లాస్య, 2.శృతి.
అండర్-14 బాలుర సింగిల్స్: 1.వి.ప్రీతమ్, 2.హర్షిత్ కొసరాజు.
సింగిల్స్ విజేతలు నిధి, రాహుల్
Published Tue, Dec 24 2013 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement