రవితేజ, బాలచంద్ర ప్రసాద్ ముందంజ | Ravi teja, Balachandra prasad in lead position | Sakshi
Sakshi News home page

రవితేజ, బాలచంద్ర ప్రసాద్ ముందంజ

Published Fri, May 2 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Ravi teja, Balachandra prasad in lead position

ఆర్‌బీవీఆర్‌ఆర్ స్మారక చెస్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాజా బహుదూర్ వెంకట్రామ్‌రెడ్డి(ఆర్‌బీవీఆర్‌ఆర్) స్మారక రాష్ట్ర సీనియర్ చెస్ టోర్నమెంట్‌లో తొలి రోజు ఎస్.రవితేజ,బాలచంద్ర ప్రసాద్‌రెడ్డి తొలి రౌండ్‌లో విజయాలను నమోదు చేసుకున్నారు.  రాష్ట్ర చెస్ అసోసియేషన్(ఏపీసీఏ) ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కాలేజిలో శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో ఎస్.రవితేజా(1) రాజా రిత్విక్(0)పై విజయం సాధించింది.
 
  కృష్ణతేజ(1) శ్రీరోహిత్(0)పై, బాలచంద్ర ప్రసాద్(1) మనీష్ చౌదరి(0)పై, జె.మల్లేశ్వర్‌రావు(1) వి.సాహితి(0)పై, చక్రవర్తిరెడ్డి(1) సి.హెచ్,లాస్య(0)పై గెలిచారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభ వేడుకలకు రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్. గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ టి.అమర్‌కాంత్‌రెడ్డి, ఏపీసీఏ ఉపాధ్యక్షుడు మేజర్ కె.ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.కన్నారెడ్డి, ఏవీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ పి.యాదగిరిరెడ్డి, డాక్టర్ జి.జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 అండర్-9 బాలుర విభాగం: తొలి రౌండ్ ఫలితాలు: చైతన్య సాయి(1) అభినవ్ చంద్ర(0)పై, సాయి ప్రణవ్(1) అభిరామ్‌రెడ్డి(0)పై, వెంకట రఘునందన్(1) పంకజ్ దత్(0)పై గెలుపొందారు.
 
 అండర్-9 బాలికల విభాగం: సి.హెచ్.వైష్ణవి(1) కాత్యాయని దాట్ల(0)పై, నాగ విజయకీర్తి(1) హంసిక(0)పై,  నాతుర బేతి(1) రోచిష్నరెడ్డి(0)పై, కె.జాహ్నవి(1) డి.మణుశ్రీ(0) ఎన్.సాత్విక(1)  దాట్ల అనన్య(0)పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement