రంగారెడ్డి జిల్లాకు బాలికల టైటిల్ | rangareddy district girls won title in hockey tournment | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాకు బాలికల టైటిల్

Published Wed, Dec 25 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

రాష్ట్ర ‘పైకా’ హాకీ టోర్నమెంట్‌లో బాలికల టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు చేజిక్కించుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను అనంతపురం జట్టు గెల్చుకుంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర  ‘పైకా’ హాకీ టోర్నమెంట్‌లో బాలికల టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు చేజిక్కించుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను అనంతపురం జట్టు గెల్చుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన బాలికల హాకీ ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 2-0 స్కోరుతో వైఎస్‌ఆర్ కడపపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు 2-1తో కృష్ణాపై గెలిచింది.
 
 బాలుర విభాగం ఫైనల్లో అనంతపురం 2-1తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 2-1తో చిత్తూరుపై నెగ్గింది. ఈ పోటీలకు శాప్ డిప్యూటీ డెరైక్టర్ జి. శోభ విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె.నర్సయ్య, పైకా క్రీడల సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్, ఆర్‌ఆర్‌డీఎస్‌ఏ అధికారి ఇ.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement