గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభ వేడుకలు విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభ వేడుకలు విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ‘కోడ్’ అమలులో ఉండటంతో ఈ శిబిరాలను అట్టహాసంగా ప్రారంభించలేదు.
ఇప్పటికే ఈ శిబిరాలు ఆరంభమైనప్పటికీ అధికారిక ప్రారంభ వేడుకలను మాత్రం గురువారం నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకలకు జీహెచ్‌ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో డిప్యూటీ మేయర్ జి. రాజ్ కుమార్, స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ శ్రీరామచంద్ర తదితరులు పాల్గొంటారు.