ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఉద్యోగుల క్రీడల్లో తొలి రోజు వాలీబాల్ పోటీల్లో ట్యాంక్‌బండ్ జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, నార్త్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హెడ్ ఆఫీస్ జట్టు 25-3, 25-17 స్కోరుతో వెస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు 25-3, 25- 17 స్కోరుతో ఈస్ట్ జోన్ జట్టుపై గెలిచింది.
కబడ్డీ ఈవెంట్‌లో సౌత్ జోన్ 29-15తో ఈస్ట్ జోన్‌పై, వెస్ట్ జోన్ 40-36తో హెడ్ ఆఫీస్ జట్టు పై గెలిచాయి. ఈ పోటీలను జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, డిప్యూటీ మేయర్ జి.రాజ్ కుమార్, స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ సెమీస్‌లో జీహెచ్‌ఎంసీ
Published Sat, Nov 30 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement