నగరానికి చెందిన ప్రవీణ్ కుమార్, శోభన్ రాజ్‌లు అంతర్జాతీయ క్యారమ్ అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నగరానికి చెందిన ప్రవీణ్ కుమార్, శోభన్ రాజ్‌లు అంతర్జాతీయ క్యారమ్ అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల హర్యానాలోని గుర్గావ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ క్యారమ్ టోర్నీలో అంపైర్ పరీక్షలు కూడా జరిగాయి. ఇందులో వీరిద్దరు ‘ఎ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారని హైదరాబాద్ క్యారమ్ సంఘం తెలిపింది.
ఈ పరీక్షల్లో భారత్‌తో పాటు అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, పోలండ్, మాల్దీవులు, శ్రీలంక, మలేసియా, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, కెనడా దేశాలకు చెందిన అంపైర్లు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఎన్‌టీపీసీలో మానవ వనరుల విభాగం మేనేజర్‌గా పని చేస్తున్నారు. శోభన్‌రాజ్ క్యారమ్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరికి ఇంటర్నేషనల్ క్యారమ్ సమాఖ్య (ఐసీఎఫ్) అధ్యక్షుడు ఎస్.కె.శర్మ సర్టిఫికెట్లు అందజేశారు.