ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ఎం.సూర్యనారాయణ, జి.సిద్దయ్య, కె.శ్రీకాంత్ తొలి రౌండ్‌లో విజయాలను నమోదు చేసుకున్నారు.
రాఘవ్ చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేశవ మెమోరియల్ కాలేజి సర్దార్ పటేల్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సూర్యనారాయణ (1) రణధీర్(0)పై నెగ్గాడు. ఇతర పోటీల్లో జి.సిద్దయ్య(1) ఎస్.శ్రీరోహిత్(0)పై, శ్రీకాంత్(1) ఫణి కుమార్(0)పై, ఎస్.కె.బ్రహ్మన్ (1) నాగ విజయ కీర్తి(0)పై, పి.అనీష్(1) పి.కాంతి కుమార్(0)పై నెగ్గారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి.కె.గార్,్గ ఆంధ్రాబ్యాంక్ డీజీఎమ్ వై.అమర్‌నాథ్, ఏపీసీఏ ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి, రాఘవ చెస్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.