ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వీపీజీ ఓపెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్ క్లబ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) జట్లు విజయాలను సాధించాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని బాస్కెట్‌బాల్ కోర్టులో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో సికింద్రాబాద్ క్లబ్ జట్టు 44-38 పాయింట్ల తేడాతో కుమోన్ జట్టుపై విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్ జట్టులో అభిరామ్ 17 పాయింట్లను నమోదు చేశాడు.
అమన్ 8 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో ఎన్‌పీఏ 42-41తో హైదరాబాద్ నవాబ్స్ జట్టుపై గెలిచింది. ఎన్‌పీఏ జట్టులో కాకు 20, అక్రమ్ 9 పాయింట్లు చేసి తమ జట్టును గెలిచారు. నవాబ్స్ జట్టులో ఇంద్రజిత్ 15, సాకేత్ 12 పాయింట్లు చేశారు.
సికింద్రాబాద్ క్లబ్, ఎన్‌పీఏ ముందంజ
Published Wed, Dec 11 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement