secunderabad club
-
సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం.. కంటోన్మెంట్ బోర్డులో కదలిక
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంతో కంటోన్మెంట్ బోర్డులో కదలిక మొదలైంది. బోర్డు పరిధిలోని నివాసాల భద్రత చర్చనీయాంశమైంది. కంటోన్మెంట్ చట్టంలో ఫైర్ సేఫ్టీ పాటించాలని ప్రత్యేక నిబంధనలున్నాయి. అయితే దశాబ్దాలుగా ఏ ఒక్క నిర్మాణానికీ ఫైర్ ఎన్ఓసీ ఇచ్చిన దాఖలాల్లేవు. అలాగని జీహెచ్ఎంసీని ఆశ్రయిస్తే తమ పరిధి కాదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్లో ఫైర్ సేఫ్టీపై బోర్డు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటు నివాసాల సంగతి అటుంచితే.. పక్కా వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్సు లేకుండానే ఓల్డ్ గ్రాంట్ (పురాతన) బంగళాల్లో కొనసాగుతున్న వ్యాపారాల కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఈఓ బి.అజిత్‌రెడ్డి ఆదేశాలతో బోర్డు అధికారులు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. 15 మీటర్ల ఎత్తుకు లోబడే నిర్మాణాలు ► 10 వేల ఎకరాల విస్తీర్ణంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 6,500 ఎకరాలకుపైగా స్థలం మిలటరీ అధీనంలోనే ఉంది. 2,800 ఎకరాల ప్రైవేటు స్థలంలోనే 400పైగా కాలనీలు, 50కిపైగా బస్తీలున్నాయి. మొత్తం భవనాల్లో కమర్షియల్ నిర్మాణాలు 5 శాతానికి మించిలేవు. ఫైర్ సేఫ్టీ నిబంధనల మేరకు 15 మీటర్లు.. అంతకంటే ఎత్తులో ఉండే భవనాలు, బహుళ అంతస్తులకు మాత్రమే ఎన్ఓసీ తీసుకోవాలి. కాగా, కంటోన్మెంట్లో 15 మీటర్లకు మించి నిర్మాణాలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో వెలిసిన నిర్మాణాలకు ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. (చదవండి: మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్) ► అయితే ఆరు మీటర్లకంటే ఎత్తులో నిర్మించిన ఫంక్షన్ హాల్స్, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు ఎన్ఓసీలు తప్పనిసరి. అయితే, ఈ కేటగిరీలోకి వచ్చే అధికారిక భవనాలు కొన్నే ఉన్నాయి. ► బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు, వ్యాపారాలకు బోర్డు నుంచి అనుమతులతో పాటు ట్రేడ్‌లైసెన్సులు జారీ చేస్తారు. ఓజీబీలే టార్గెట్.. ► కంటోన్మెంట్లో బీ–3 కేటగిరీ స్థలాలుగా పరిగ ణించే ఓల్డ్ గ్రాంట్ బంగళా(ఓజీబీ)లు 117 ఉన్నాయి. ► బ్రిటిష్ జమానాలో అప్పటి మిలటరీ ఉన్నతాధికారులు, వ్యాపారులు, భూస్వాములకు నివాస అవసరాలకు వీటిని కేటాయించారు. ► స్థలం యాజమాన్య హక్కులు ఎప్పటికీ రక్షణ శాఖ అధీనంలో ఉండేలా, కేవలం భవనాలను మాత్రమే ఆయా వ్యక్తులకు అప్పగించారు. ► ఈ మేరకు హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద బంగళాలను దక్కించుకున్న వ్యక్తులు నివాస అవసరాలకే వీటిని వాడాలి. ► బంగళా రూపురేఖల్లో మార్పులు చేయడం, నూతన నిర్మాణాలు చేపట్టడం, కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ► ఈ బంగళాలను ఇతరులకు విక్రయించరాదు. హెచ్ఓఆర్ కలిగిన వ్యక్తుల వారసుల పేరిట మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ► ఓల్డ్ గ్రాంట్ బంగళాల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆయా బంగళాలను రక్షణ శాఖ ఎప్పుడైనా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ► సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇలాంటి 117 బంగళాల్లో సగానికిపైగా భవనాలు మిలటరీ అధీనంలోనే ఉన్నాయి. కాగా, మిగిలిన వాటిలో పలు బంగళాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ► కంటోన్మెంట్ పరిధిలో 42 బంగళాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన బోర్డు అధికారులు 2007లో నోటీసులు జారీ చేశారు. ఐదేళ్ల క్రితం సుమారు 20 బంగళాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ► అయితే ఇప్పటికీ 40కి పైగా ఓల్డ్ గ్రాంట్ బంగళాల్లో 13 ఫంక్షన్ హాళ్లు సహా పూర్తిస్థాయిలో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ బోర్డు నుంచి ట్రేడ్ లైసెన్సు లేదు. ► బోర్డు అనుమతి, ట్రేడ్‌లైసెన్సు లేకుండా కొనసాగుతున్న వ్యాపారాలకు ఫైర్ ఎన్ఓసీలు తీసుకునే అవకాశమే లేదు. ► సికింద్రాబాద్ క్లబ్ కూడా ఈ తరహా బంగళా (బంగళా నంబర్ 220) కావడం విశేషం. క్లబ్లో ప్రమాదం నేపథ్యంలో మిగతా ఓల్డ్ గ్రాంట్ బంగళాలే టార్గెట్‌గా అధికారులు ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు) -
మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్.. కొందరు ఆ కోరిక తీరకుండానే
సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్‌గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్‌వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్‌గా ఏర్పడింది. ► నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్లు, థియేటర్ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్‌పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు. ► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది. ► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్‌గా మారింది. ► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు. ► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు సికింద్రాబాద్ క్లబ్లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్ కలిగిన హైదబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’) ► ఈ క్లబ్‌లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా) -
సికింద్రాబాద్ క్లబ్ ఘటన పై దర్యాప్తు ముమ్మరం
-
సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident In Secunderabad Club: కంటోన్మెంట్: నగరంలోని పురాతన సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ విభాగం, బార్, లైబ్రరీలు పూ ర్తిగా మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అవి అదుపులోకి రాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రూ.20 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన వైరింగే కారణమా? ► 20.17 ఎకరాల స్థలంలో వెలసిన సికింద్రాబాద్ క్లబ్లో వివిధ క్రీడా ప్రాంగణాలతో పాటు సువిశాలమైన ప్రధాన భవనం ఉంది. ఇందులోనే మూడు బార్లు, డైనింగ్ హాల్స్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఉన్నాయి. ఈ భవనాన్ని ఆనుకునే కాన్షరెన్స్, మీటింగ్ హాళ్లు, పెట్రోల్ బంకు, బ్యాంకు భవనాలు ఉన్నాయి. ►సుమారు వందేళ్ల నాటి ప్రధాన భవనం బ్రిటిష్ శైలిలో నిర్మితమైంది. కేవలం ఇనుప స్తంభాలపై చెక్కలతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. భవనంలోని పురాతన వైరింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని యాజమాన్యం సైతం భావిస్తోంది. చెక్కలతో కూడిన నిర్మాణంతో పాటు బార్‌లోని మద్యం కూడా అగ్ని కీలలు ఎగిసి పడటానికి కారణమైనట్లు భావిస్తున్నారు. మీడియాకు నో ఎంట్రీ అగ్ని ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే వివిధ మీడియా చానెళ్లు, పత్రికల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో క్లబ్‌కు చేరుకున్నారు. అప్పటికే క్లబ్ మూడు ద్వారాలనూ మూసేశారు. పోలీసు బందోబస్తుతో లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఎట్టకేలకు క్లబ్ అధ్యక్షుడు రఘురామి రెడ్డి బయటకు వచ్చి ప్రమాద వివరాలను వెల్లడించారు. ప్రమాద ఘటనకు కారణాలు, నష్టంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేమన్నారు. ఇంజినీరింగ్ విభాగం నివేదిక ఇచ్చాకే నష్టంపై స్పష్టత వస్తుందన్నారు. పరిశీలించిన ఎమ్మెల్యే, పీసీబీ, సీఈఓ.. సికింద్రాబాద్ క్లబ్ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సాయన్న క్లబ్‌ను సందర్శించారు. యాజమాన్యంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు, సికింద్రాబాద్ స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ బి.అజిత్ రెడ్డిలు క్లబ్‌ను సందర్శించి ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని పరిశీలించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ క్లబ్ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. ఈ ప్రమాదం దురదృష్టకరం అంటూనే, క్లబ్ యాజమాన్యం ఫైర్ జాగ్రత్తలు పాటించారా? సంబంధిత అధికారుల నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్నారా? అంటూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఫైర్ ఎన్ఓసీ లేదు! సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఫైర్ ఎన్ఓసీలు ఇవ్వడం కుదరదు. కంటోన్మెంట్లో ఫైర్ విభాగమే లేదు. ఇక నేరుగా అగ్నిమాపక శాఖ డీజీ పరిధిలోనే ఎన్ఓసీలు జారీ చేయాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ క్లబ్ యాజమాన్యం ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ తీసుకోలేదని తెలుస్తోంది. -
సికింద్రాబాద్ క్లబ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 44-37తో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ తరఫున అమన్ 12 పాయింట్లు, రోహన్ 11 పాయింట్లు సాధించగా... ఒమెగా జట్టు తరఫున అరుణ్ 17 పాయింట్లు, సాయి కుమార్ 12 పాయింట్లతో ఆక ట్టుకున్నారు. ఇతర మ్యాచ్ ల్లో హూప్‌స్టర్స్ క్లబ్ 55-44తో వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ జట్టు తరఫున వెంకటేశ్ (16), రామకృష్ణా రెడ్డి (21)... వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టులో విశాల్ (11), రాజారెడ్డి (10), సోహైల్ ఖాన్ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో ఎన్పీఏ జట్టు 52- 36తో జింఖానా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. ఎన్పీఏ జట్టు తరఫున రాహుల్ (15), భూపేందర్ (11), ప్రశాంత్ (10)... జింఖానా జట్టులో ఆమీర్ (17), రెహమాన్ (10) ప్రతిభ కనబరిచారు. 22 నుంచి ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్ తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ జరుగనుంది. కులీ కుతుబ్ షా స్టేడియంలో పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 8, 10, 12, 14, 16 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయి. ఇందులో నగరానికి చెందిన అన్ని పాఠశాలలు పాల్గొనవచ్చు. ఆగస్టు 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 9700008253 నంబర్లో సంప్రదించవచ్చు. -
సికిందరాబాద్‌లో ఏపి-టీఎస్ స్నూకర్ పోటీలు
-
సికింద్రాబాద్ క్లబ్, ఎన్పీఏ ముందంజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వీపీజీ ఓపెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) జట్లు విజయాలను సాధించాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని బాస్కెట్‌బాల్ కోర్టులో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సికింద్రాబాద్ క్లబ్ జట్టు 44-38 పాయింట్ల తేడాతో కుమోన్ జట్టుపై విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్ జట్టులో అభిరామ్ 17 పాయింట్లను నమోదు చేశాడు. అమన్ 8 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో ఎన్పీఏ 42-41తో హైదరాబాద్ నవాబ్స్ జట్టుపై గెలిచింది. ఎన్పీఏ జట్టులో కాకు 20, అక్రమ్ 9 పాయింట్లు చేసి తమ జట్టును గెలిచారు. నవాబ్స్ జట్టులో ఇంద్రజిత్ 15, సాకేత్ 12 పాయింట్లు చేశారు.