చిరెక్ పబ్లిక్ స్కూల్ శుభారంభం | basket ball tournment chirec public school started | Sakshi
Sakshi News home page

చిరెక్ పబ్లిక్ స్కూల్ శుభారంభం

Published Sun, Nov 24 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

ఐఎంజీ రిల యన్స్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఐఎంజీ రిల యన్స్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో శనివారం జరిగిన బాలికల లీగ్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 36-14 స్కోరుతో నాసర్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది.
 
 బాలుర లీగ్ పోటీల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 23-16తో ఇండస్ వర్డల్ స్కూల్‌పై గెలిచింది. బాలికల లీగ్ మ్యాచ్‌లో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్ 23-20తో సెయింట్ పాయిస్ స్కూల్‌పై, హోలీ ఫ్యామిలీ  స్కూల్ 12-2తో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిపై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 30-4తో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజిపై గెలిచాయి. బాలుర లీగ్ పోటీల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 20-3తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై, గీతాంజలి స్కూల్ 34-18తో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్‌పై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement