inter school basket ball tournment
-
చిరెక్ పబ్లిక్ స్కూల్ శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఐఎంజీ రిల యన్స్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో శనివారం జరిగిన బాలికల లీగ్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 36-14 స్కోరుతో నాసర్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. బాలుర లీగ్ పోటీల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 23-16తో ఇండస్ వర్డల్ స్కూల్‌పై గెలిచింది. బాలికల లీగ్ మ్యాచ్‌లో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్ 23-20తో సెయింట్ పాయిస్ స్కూల్‌పై, హోలీ ఫ్యామిలీ స్కూల్ 12-2తో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిపై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 30-4తో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజిపై గెలిచాయి. బాలుర లీగ్ పోటీల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 20-3తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై, గీతాంజలి స్కూల్ 34-18తో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్‌పై నెగ్గాయి. -
బాలికల చాంప్ చిరెక్ పబ్లిక్ స్కూల్
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ బాలికల టీమ్ టైటిల్‌ను చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు గెలుచుకుంది. బోయినపల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 30-8తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టుపై ఘనవిజయం సాధించింది. చిరెక్ జట్టులో సంహిత 12, ద్రిషితి 6 పాయింట్లతో చెలరేగారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టులో యామిని (4) మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హోలీ ఫ్యామిలీ స్కూల్ జట్టు 12-0తో సెయింట్ ఆంథోనీస్ స్కూల్ టీమ్‌పై గెలిచింది. బాలుర విభాగం ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 43-15తో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టుపై గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 21-4తో ఆధిక్యాన్ని సాధించింది. కార్తీక్ దూకుడుగా ఆడి 19, తేజస్విన్ 12 పాయింట్లు చేశాడు. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టులో జోషు 9 పాయింట్లు సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 23-22తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది.