బాలికల చాంప్ చిరెక్ పబ్లిక్ స్కూల్ | Girls Champ chirek Public School | Sakshi
Sakshi News home page

బాలికల చాంప్ చిరెక్ పబ్లిక్ స్కూల్

Aug 14 2013 12:57 AM | Updated on Sep 1 2017 9:49 PM

డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ బాలికల టీమ్ టైటిల్‌ను చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు గెలుచుకుంది.

ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ బాలికల టీమ్ టైటిల్‌ను చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు గెలుచుకుంది. బోయినపల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 30-8తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టుపై ఘనవిజయం సాధించింది. చిరెక్ జట్టులో సంహిత 12, ద్రిషితి 6 పాయింట్లతో చెలరేగారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టులో యామిని (4) మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హోలీ ఫ్యామిలీ స్కూల్ జట్టు 12-0తో సెయింట్ ఆంథోనీస్ స్కూల్ టీమ్‌పై గెలిచింది.
 
  బాలుర విభాగం ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 43-15తో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టుపై గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 21-4తో ఆధిక్యాన్ని సాధించింది. కార్తీక్ దూకుడుగా ఆడి 19, తేజస్విన్ 12 పాయింట్లు చేశాడు. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టులో జోషు 9 పాయింట్లు సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో  చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 23-22తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది.
 

Advertisement
Advertisement