ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టీమ్ టైటిల్‌ను అవంతి కాలేజి గెలుచుకుంది. మహిళల టీమ్ టైటిల్‌ను కస్తూర్బా గాంధీ కాలేజి జట్టు కైవసం చేసుకుంది.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టీమ్ టైటిల్‌ను అవంతి కాలేజి గెలుచుకుంది. మహిళల టీమ్ టైటిల్‌ను కస్తూర్బా గాంధీ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం ఈ పోటీలు ముగిశాయి.
ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 46 పాయింట్లతో అవంతి కాలేజి జట్టు అగ్రస్థానంలో నిలవగా నిజాం కాలేజి జట్టు (26) రెండో స్థానం, భవాన్స్ కాలేజి (24, సైనిక్‌పురి) జట్టు మూడో స్థానం పొందాయి. అలాగే మహిళల విభాగంలో కస్తూర్బా గాంధీ కాలేజి 68 పాయింట్లుతో తొలి స్థాన ంలో నిలిచింది. గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(జీసీపీఈ, 35.5) రెండో స్థానం, భవాన్స్ కాలేజి (20) మూడో స్థానం పొందింది. ఈ మీట్‌లో ప్రతిభ కనబర్చిన సైనిక్‌పురి భవాన్స్ కాలేజి అథ్లెట్ ఎం.రత్న కుమార్ 940 పాయింట్లతో ఉత్తమ అథ్లెట్‌గా, కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి, 884) ఉత్తమ మహిళా అథ్లెట్‌గా అవార్డులను అందుకున్నారు. ముగింపు వేడుకలకు ఓయూకు చెందిన భారత అథ్లెట్ నజీబ్ ఖురేషి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందించారు.
ఫెనల్స్ ఫలితాలు: మహిళల విభాగం:100 మీ: కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. బి. సాహితి (వెస్లీ కాలేజి), 3.పి.శ్రీలత(కస్తూర్బా గాంధీ కాలేజి). 400 మీ: 1.సి.హెచ్.హర్షిత (లయోలా అకాడమీ), 2. ఎస్.కె.షబ్నమ్ (విల్లా మేరీ కాలేజి), 3.భావన (కస్తూర్బా గాంధీ కాలేజి). 1500 మీ: 1.డి.వైష్ణవి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.జి.లలిత (జీసీపీఈ), 3.అఫ్రీన్ బేగం (విల్లా మేరీ కాలేజి). 100 మీ (హర్డిల్స్): 1.హేమలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.కె.వి.రోషిణి(లయోలా అకాడమీ), 3. లాస్య రెడ్డి (విల్లా మేరీ కాలేజి). ట్రిపుల్ జంప్: 1.కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.పి.సరిత(జీసీపీ), 3.బి.మోనిక (జీసీపీఈ). జావెలిన్ త్రో: 1.కె.రమ్య (భవాన్స్ కాలేజి), 2.కె.మమత (జీసీపీఈ), 3. షహీన్ (జీసీపీఈ). హ్యామర్‌త్రో: 1.యశస్విని (భవాన్స్ కాలేజి), 2. కె. నాగ అనూష (సెయింట్ పాయిస్ కాలేజి), 3. కాజల్ (కస్తూర్బా గాంధీ కాలేజి).
ఫురుషుల విభాగం 100మీ: 1.ఈశ్వర్ రెడ్డి (11 సెకన్లు, అవంతి కాలేజి), 2.జి.అనిల్ కుమార్ (రైల్వే కాలేజి), 3.ఎల్.తేజవర్ధన్ రెడ్డి (అరుణోదయ కాలేజి). 400మీ: 1.ఎం.రతన్ కుమార్ (భవాన్స్ కాలేజి), 2. ఎం.జెమ్య(అవంతి కాలేజి), 3.టి.రవి కుమార్ (నిజాం) 1500మీ:1.టి.కృష్ణయ్య (మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజి), 2.ఎస్.దినేష్ కుమార్ (అవంతి కాలేజి), 3.కె.రాములు (వి.వి.కాలేజి). 10,000మీ: 1.బుచ్చయ్య (యూసీపీఈ), 2.డి.హరీష్(జీసీపీఈ), 3.సూర్య ప్రకాష్ (సిటీ గవర్నమెంట్ కాలేజి). 110మీ (హర్డిల్స్): 1.హర్షవర్ధన్ (అరుణోదయ కాలేజి), 2. చంద్రబాబు (భవాన్స్ కాలేజి), 3.ప్రవీణ్ (ఎ.వి.కాలేజి). ట్రిపుల్ జంప్: 1. ప్రవీణ్ (ఎ.వి.కాలేజి), 2. పి.భాను ప్రతాప్ (వసుంధర కాలేజి), 3.పి.ఎన్.సాయి కుమార్ (రైల్వే కాలేజి). జావెలిన్‌త్రో: 1.ఎస్.కిరణ్ కుమార్ (జీసీపీఈ), 2.కుమార్ (మెథడిస్ట్ కాలేజి).