ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర స్కూల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు అండర్-17 బాలికల 42 కేజీ విభాగంలో హైదరాబాద్ బాక్సర్ నగ్మా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కీర్తి ప్రియ (విజయనగరం) రజతం, వి.అఖిల (వరంగల్), రఫత్ (కృష్ణా) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో ఆదివారం ఈ పోటీలను హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు 16 జిల్లాల నుంచి దాదాపు 250 మంది బాక్సర్లు పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు: అండర్-17 బాలికల విభాగం: 42-44 కేజీలు: 1. రమీజ (అనంతపురం), 2.జి.అక్షిత (పశ్చిమ గోదావరి), 44-56 కేజీలు: 1. ప్రమీల (తూర్పు గోదావరి), 3.కృష్ణ వేణి (హైదరాబాద్), 3. పూజ (వరంగల్). 46-48 కేజీలు: 1.జ్ఞానేశ్వరి (విశాఖపట్నం), 2.అఖిల రెడ్డి (రంగారెడ్డి), 3. అక్షయ (వరంగల్). 48-50 కేజీలు: 1.హేమ (కరీంనగర్), 2.సోని (వరంగల్), 3.టి.గౌతమి (అనంతపురం), 3.ఎం.విజయలక్ష్మి (తూర్పు గోదావరి). 50-53 కేజీలు: 1.డి.తన్మయ యాదవ్ (హైదరాబాద్), 2.డి.నివేదిత (గుంటూరు). 59-62 కేజీలు: 1.మనిరేఖ (మెదక్), 2.కవిత (హైదరాబాద్), 3.సి.హెచ్.రమ్య (వరంగల్).
అండర్-17 బాలికల విజేత నగ్మా
Published Sun, Nov 10 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement