అంతర్ జిల్లా సబ్ జూనియర్ వుషు టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో చైతన్య ప్రసాద్(హైదరాబాద్) స్వర్ణం సాధించాడు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ వుషు టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో చైతన్య ప్రసాద్(హైదరాబాద్) స్వర్ణం సాధించాడు. మహేష్ బిస్తి(రంగారెడ్డి) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, శ్రీరామ్(నిజామాబాద్), గౌతమ్(రంగారెడ్డి) కాంస్య పతకం గెలుచుకున్నారు.
రాష్ట్ర వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్‌లో గురవారం ఈ పోటీలు ముగిశాయి. విజేతలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వుషు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎ.ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్బాస్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: బాకి దౌషు ఈవెంట్: 1. వంశీ (నిజామాబాద్), 2. నితీష్ (పశ్చిమ గోదావరి), 3. ఫహారా ఖాన్(రంగారెడ్డి).