5 కి.మీ. రేస్ విజేత బుచ్చయ్య | buchaiah won five kilo meters race | Sakshi
Sakshi News home page

5 కి.మీ. రేస్ విజేత బుచ్చయ్య

Published Mon, May 26 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

buchaiah won five kilo meters race

సమ్మర్ రోడ్ రేస్
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్‌ఏసీఏ వార్షిక సమ్మర్ రోడ్ రేస్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 5 కిలో మీటర్ల పరుగులో  సి.హెచ్.బుచ్చయ్య (ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి) విజేతగా నిలిచాడు. అతను 14 నిమిషాల 34:50 సెకన్లలో గమ్యం చేరాడు. సయ్యద్ వజీర్ ఘోరి (ఓయూ) రెండో స్థానంతో రజతం గెలుపొందగా, ఎం.ప్రకాష్ (ఓయూ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు. హైదరాబాద్ అథ్లెటిక్ కోచింగ్ అకాడమీ (హెచ్‌ఏసీఏ) ఆధ్వర్యంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(హెచ్‌డీఏఏ) సౌజన్యంతో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి మైదానంలో ఈ పోటీలు  జరిగాయి. అనంతరం ముగింపు కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
 
 ఫైనల్స్ ఫలితాలు
 అండర్-16 బాలురు 3 కి.మీ.: 1.సమన్విత్ (మేకగూడ జడ్పీ హైస్కూల్), 2.ఎం.గణేష్ (మేకగూడ జడ్పీ హైస్కూల్), 3.ఎం.గంగాధర్(మేకగూడ జడ్పీ హైస్కూల్). అండర్ -13 బాలురు 2 కి.మీ.: 1.పి.రాయుడు (జడ్పీ హైస్కూల్), 2.ఎం.జీవన్(జడ్పీ  హైస్కూల్), 3. లోహిత్ (కేవీఎస్). అండర్-10 బాలురు 2 కి.మీ.: 1.జి.చెన్నయ్య (జడ్పీ హైస్కూల్), 2.బి.అజయ్ (బీటీ హైస్కూల్), 3.అశోక్ (జడ్పీ హైస్కూల్). మాస్టర్ పురుషుల విభాగం: తాహసీన్ కరీమ్ (ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి), 2.డి.సి.ఆనందం (రంగారెడ్డి), 3.జి. నారాయణ (ఆర్‌ఆర్‌సీ). మహిళల విభాగం:  3 కి.మీ.: 1.జి.ఉమామహేశ్వరి (నిజామ్ కాలేజి గ్రౌండ్), 2.బి.లక్ష్మి (వరంగల్), 3.ఎం. అలివేలు (జడ్పీ హైస్కూల్).  అండర్-16 బాలికలు 3 కి.మీ.: 1.జి.అనూష (జడ్పీ  హైస్కూల్), 2.పి. తులసి (ఎల్.బి.నగర్), 3. సుప్రియా (బోయిన్‌పల్లి).  అండర్-13 బాలికలు 2 కి.మీ.: 1.ఎ.కార్తీ (ఓయూ గ్రౌండ్), 2.పి.మమత (జడ్పీ హైస్కూల్), 3.సుస్మిత(కేజీబీవీ). అండర్-10 బాలికలు 2 కి.మీ.: 1.పి.వసంత (జడ్పీ హైస్కూల్), 2 శిరీష (కేజీబీవీ), 3. గౌతమి (కేవీ బేగంపేట్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement