ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్‌కం ట్యాక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను పియూష్ సమారియా(ఆంధ్రప్రదేశ్) కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను లీనా రఘునందన్(కర్ణాటక) గెల్చుకుంది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో పియూష్ 21-15, 21-19తో కాశీ విశ్వనాథ్ రాజు(ఏపీ)పై నెగ్గాడు. మహిళల ఫైనల్లో లీనా (కర్ణాటక) 21-15, 21-17తో శ్రీవిద్యా (కర్ణాటక)పై గెలిచింది. విజేతలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి. శీలం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
డబుల్స్ ఫైనల్ ఫలితాలు
పురుషుల డబుల్స్: 1.తిజేందర్ సింగ్, పి.నాగేష్ జోడి (ముంబై), 2.కాశీ విశ్వనాథ్ రాజు, ఎం.ఎస్.ఎస్.ఎన్.శ్రీనివాస్ జోడి (ఏపీ). మహిళల డబుల్స్: 1.ప్రమోద నటరాజ్, శ్రీవిద్యా సతీష్ అయ్యర్ జోడి(కర్ణాటక), 2. లీనా రఘునందన్, ఎస్.గాయత్రి జోడి(కర్నాటక).
ఆలిండియా ఇన్‌కం ట్యాక్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
Published Fri, Nov 22 2013 11:36 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement