ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యాసంస్థల క్రీడల్లో భాగంగా జరిగిన వాలీబాల్ టోర్నీలో సర్ధార్ పటేల్ (ఎస్‌పీ) కాలేజి శుభారంభం చేసింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన వాలీబాల్ పోటీల్లో ఎస్‌పీ కాలేజి 25-12, 25-20 స్కోరుతో శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి 18-25, 25-16, 15-13తో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కాలేజి (భువనగిరి)పై గెలిచింది. మూడో మ్యాచ్‌లో ఎస్‌పీ కాలేజి 25-16, 25-12తో కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ (కల్వకుర్తి)పై గెలిచింది.
అంతకు ముందు ఈపోటీలను హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈక్రీడల్లో క్యారమ్, టెన్నికాయిట్, బాస్కెట్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు.
ఎస్‌పీ కాలేజి శుభారంభం
Published Sun, Jan 19 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement