ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జాతీయ సీనియర్ కార్ఫ్‌బాల్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సాధించింది. డిసెంబరు 27 నుంచి 30 వరకు చెన్నైలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఏపీ జట్టు 11-6 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. ఏపీ జట్టులో కెప్టెన్ డానియల్ 4, విజయ్ 3 పాయింట్లను నమోదు చేయగా, పవన్, అమిత జైస్వాల్ తలా రెండు పాయింట్లను సాధించారు.
సెమీఫైనల్లో ఏపీ జట్టు 11-4 స్కోరుతో ఛత్తీస్‌గఢ్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఏపీ జట్టు 15-3తో పశ్చిమ బెంగాల్ జట్టుపై నెగింది. బుధవారం ఉదయం చెన్నై నుంచి నగరానికి వచ్చిన రాష్ట్ర జట్టు సభ్యులకు నాంపల్లి రైల్వే స్టెషన్‌లో ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులకు హైదరాబాద్ జిల్లా కార్ఫ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు వై.కృష్ణ, సంయుక్త కార్యదర్శి పృథ్వీరాజ్, కార్ఫ్‌బాల్ కోచ్ సంతోష్‌లు స్వాగతం పలికారు.
చాంప్ ఆంధ్రప్రదేశ్
Published Thu, Jan 2 2014 12:04 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement
Advertisement