ఏపీ మహిళలకు కాంస్యం | south zone hand ball championship Ap womens won bronze | Sakshi
Sakshi News home page

ఏపీ మహిళలకు కాంస్యం

Published Sat, Oct 19 2013 12:02 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

south zone hand ball championship Ap womens won bronze

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సౌత్ జోన్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కాంస్యం దక్కింది. తమిళనాడులోని చెన్నైలో గురువారం కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు 8-4 స్కోరుతో పుదుచ్చేరి జట్టుపై గెలిచింది. ఏపీ జట్టులో హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణి రుషిక నాలుగు గోల్స్ చేయగా, విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ రెండు గోల్స్‌ను నమోదు చేసింది.
 
 ఓయూ హాకీ, కబడ్డీ క్యాంప్ 21నుంచి
 ఇంటర్ యూనివర్సిటీ మహిళల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) కోచింగ్ క్యాంప్ ఈనెల 21 నుంచి ఓయూ హాకీ మైదానంలో జరుగుతుంది. ఓయూ పరిధిలోని కాలేజి హాకీ క్రీడాకారిణులు ఈనెల 21న సాయంత్రం నాలుగు గంటలకు హాకీ కోచ్ మనోహర్‌కు రిపోర్ట్ చేయాలని ఓయూ ఇంటర్ వర్సిటీ టోర్నీ కార్యదర్శి ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. జిమ్నాస్టిక్ పురుషుల, మహిళల కోచింగ్ క్యాంప్ ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జిమ్నాస్టిక్ కోచ్ ప్రభాకర్ పర్యవేక్షణలో శిబిరం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓయూ పురుషుల కబడ్డీ కోచింగ్ క్యాంప్ 21 నుంచి ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. కోచ్‌గా శ్రీనివాస్ వ్యవహరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement