హఫీజ్ స్మారక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ)(ఏ), హైదరాబాద్ గ్లోబ్ క్లబ్, ఎస్‌ఎస్ ముర్షాద్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కి చేరాయి.
హఫీజ్ స్మారక ఫుట్‌బాల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హఫీజ్ స్మారక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ)(ఏ), హైదరాబాద్ గ్లోబ్ క్లబ్, ఎస్‌ఎస్ ముర్షాద్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కి చేరాయి. విజయనగర్ కాలనీ ఫుట్‌బాల్ మైదానంలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సీసీఓబీ(ఏ) జట్టు 2-1స్కోరుతో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది.
సీసీఓబీ జట్టు మాజీ అంతర్జాతీయ ఆటగాడు మౌజమ్ 26, 45వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేశాడు. స్పోర్టింగ్ జట్టు తరపున అబన్నన్ 50వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. రెండో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ గ్లోబ్ క్లబ్ జట్టు 2-0 స్కోరుతో అబ్బాస్ యూనియన్ జట్టుపై గెలిచింది. అబ్దుల్ అమన్ 14వ నిమిషంలో, ఫహాద్ 35వ నిమిషంలో గోల్స్ చేశారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఎస్‌ఎస్ ముర్షాద్ జట్టు 4-1 స్కోరుతో మల్లేపల్లి ఫుట్‌బాల్ క్లబ్ జట్టుపై గెలిచింది.