ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ టోర్నీలో ఆంధ్రకేసరి (84-130 కేజీల) డిఫెండింగ్ చాంపియన్ హబీబ్ అబ్దుల్లా జిలానీ (బామాస్ అఖాడా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో హబీబ్ అబ్దుల్లా... మహ్మద్ (నూరాని తాలీమ్)పై విజయం సాధించాడు. మహ్మద్ సమద్ తబ్రేజ్ (మౌలబాన్ ఉస్తాద్), మహ్మద్ అస్లీమ్ (సమద్ ఉస్తాద్)లు మూడో స్థానం పొందారు. విజేతకు సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గదను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ ఫలితాలు: 55 కేజీలు: 1. టి.కృష్ణ సింగ్ (రహీంపురా పీజీ), 2. సంజయ్ కుమార్ (సురేష్ పహిల్వాన్), 3. ఇ. శివాజీ (నిజామాబాద్), 3. విజయ్ కుమార్ (విక్టరీ ప్లేగ్రౌండ్స్). 60 కేజీలు: 1. టి.దేవీ సింగ్ (లాలా తలీమ్), 2. వినయ్ కుమార్ (ఆర్‌పీసీ), 3. డి.సందీప్(జై భవానీ వ్యాయామశాల), 3. చంద్రన్ సింగ్ (లాలా తలీమ్). 66 కేజీలు: దినేష్ (శ్రీరామ్ వ్యాయామశాల), 2. జి.అశ్విన్ (శ్రీరామ్ వ్యాయామశాల), 3. అబూ బకర్ (బిన్ ఖలీఫా అఖాడా). 74 కేజీలు: 1. జాఫర్‌బిన్ ముబారక్ (ఖులీఖ్ ఉస్తాద్), 2. మహ్మద్ జునైద్ ఖలీద్, 3. సి.గజేంద్ర (జ్ఞానేశ్వర్ ఉస్తాద్), 3. జి.నితీష్ యాదవ్ (హైదరాబాద్ డీసీసీ). 84 కేజీలు: 1. ఒమర్ బిన్ జావిద్ (అలీ ఉస్తాద్), 2. మహ్మద్ హబీబ్ ఖాన్ (బామాస్ అఖాడా). 3. మహ్మద్ అబ్దుల్ సుల్తాన్ (బామాస్ అఖాడా), 3.అబ్దుల్ రహీమ్ (బామాస్ అకాడమీ). 84-120 కేజీలు:1.జి.శ్రీనాథ్ యాదవ్ (శ్రీను పహిల్వాన్), 2. ఇమ్రాన్ (అలీ వస్తాద్), 3. అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది (సలామ్ పహిల్వాన్). 3.శాంతి కుమార్ (అడవయ్య ఉస్తాద్).
అబ్దుల్లాకు ‘ఆంధ్రకేసరి’ టైటిల్
Published Fri, Nov 29 2013 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement