Abdullah
-
సమాజ్‌వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. పదిహేనేళ్ల కిందటి నాటి కేసులో(2008).. సువార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌కు మోరాదాబాద్ కోర్టు రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన ఫిబ్రవరి 13వ తేదీ నాటి నుంచి అబ్దుల్లాపై అనర్హత వేటు అమలులోకి వస్తుంది అంటూ అసెంబ్లీ సెక్రెటరీ పేరిట ప్రకటన వెలువడింది. అబ్దుల్లా అజాం ఖాన్ ఎవరో కాదు.. ఎస్పీ దిగ్గజనేత, వివాదాస్పద అజాం ఖాన్ తనయుడు. ఏం జరిగిందంటే.. డిసెంబరు 31, 2007న రాంపూర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SEPF) క్యాంపుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే 2008, జనవరి 29వ తేదీన అజాం ఖాన్, అబ్దుల్లా ఖాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని తనిఖీ చేయడం కోసం పోలీసులు ఆపారు. దీనిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు తండ్రీకొడుకులు. అయితే.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీళ్లిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులోనే మోరాదాబాద్ కోర్టు తాజాగా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. రెండేళ్ల శిక్షలు ఖరారు చేసింది. మరో విశేషం ఏంటంటే.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొవడం అబ్దుల్లా అజాం ఖాన్‌కు ఇది రెండోసారి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గంలో ఎస్పీ తరపున పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. అయితే.. అప్పటికీ ఎమ్మెల్యేగా అర్హత వయసు(25 సంవత్సరాలు) నిండకుండానే నామినేషన్స్ దాఖలు చేశాడు అతను. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. దీంతో.. 2020లో.. అలహాబాద్ హైకోర్టు అతని ఎన్నికను రద్దు చేసింది. అయితే తిరిగి 2022 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. చట్ట సభ్యులెవరైనా సరే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష గనుక పడితే.. వాళ్ల సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
రాజ్యసభకు ఎంఎం అబ్దుల్లా.. ఏకగ్రీవమేనా..?!
సాక్షి,చెన్నై: రాజ్యసభకు డీఎంకే అభ్యర్థి ఎంఎం అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఓ సీటుకు సెప్టెంబర్ 13న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 30వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ కార్యాలయం ఆవరణలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే, డీఎంకే అభ్యర్థిగా అబ్దుల్లా పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో అబ్దుల్లా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక, అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితుల్లో అన్నాడీఎంకే వర్గాలు లేనట్లు తెలుస్తోంది. చదవండి: Annamalai Strategy To Strengthen BJP: పదవుల పందేరం? -
భారత్ మాకెప్పుడూ మిత్ర దేశమే
న్యూఢిల్లీ: ఆఫ్గనిస్తాన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్న హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సీలియేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఛైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా.. నరేంద్ర మోదీని కలిసి, యుద్ధంతో చిన్నాభిన్నమైన తమ దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి జరుగుతున్న కృషిని వివరించారు. మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్‌లో జరిగిన సమావేశంలో అబ్దుల్లా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియ కొనసాగడానికి భారత దేశం సహాయం కొనసాగిస్తుందని మోదీ హామీ ఇచ్చినట్లు అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆఫ్గనిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మోడీ కట్టుబడి ఉన్నారని విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ శ్రీవాస్తవ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియకి మద్దతు కూడగట్టడానికి ఐదు రోజుల పర్యటనకు అబ్దుల్లా భారత దేశం వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో అబ్దుల్లా సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్ ఎప్పటికీ తమకు మిత్రదేశమేనని అబ్దుల్లా అన్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా యుద్ధం తరువాత కూడా దేశంలో అంతర్గత సంఘర్షణల విషయంలో సైనిక పరిష్కారానికి తావులేదని అబ్దుల్లా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం భారత దేశం పదిహేను వేల కోట్ల సాయాన్ని అందించింది. ఇటీవల తాలిబన్లతో అమెరికా చేసుకున్న శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉంది. 2001 సంవత్సరం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటి వరకు అమెరికా 2400 మంది సైనికులను కోల్పోయింది. ప్రజల ఆకాంక్షలను గౌరవించడానికి ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి రావాలని ఇండియా ఆకాంక్షిస్తూ ఉంది. (చదవండి: తైవాన్ ప్రకటన; చైనాకు భారత్ కౌంటర్!) -
‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్‌ఫోన్ సాయంతో ‘ఉగ్ర’నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) నిర్వహిస్తున్న ఆన్లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐఎస్కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్‌పై వచ్చిన బాసిత్‌ను ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన దంపతులు జహన్ జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. బాసిత్ ఆదేశాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఓ దశలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్‌లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్ ఆఫ్ హింద్’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్ రావడంతో బాసిత్ నెట్‌వర్క్‌లో మరికొందరు బయట ఉన్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగించిన బాసిత్ పుణేకు చెందిన నబీల్ ఎస్ ఖాత్రి, సాదియా అన్వర్ షేక్‌లను ఐఎస్‌కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎవరీ బాసిత్?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
రాజేశ్వరి అబ్దుల్లా కూతురు
ఇటీవలే మసీదులో ఒక హిందూ జంట పెళ్లి జరిపించి లౌకిక తత్వాన్ని చాటుకుంది కేరళ. ఇప్పుడు మళ్లీ అలాంటి వేడుకతో మానవత్వానికీ ప్రతీకగా నిలిచింది. కేరళలోని కున్నరియమ్ పట్టణానికి చెందిన అబ్దుల్లా కుటుంబం రాజేశ్వరి అనే హిందూ అమ్మాయికి విష్ణు అనే అబ్బాయితో గుడిలో పెళ్లి జరిపించింది. కున్నరియమ్‌కు చెందిన శరవణన్ అనే రైతుకూలీ కూతురు రాజేశ్వరి. అబ్దుల్లా ఇంట్లో, అతని తోటలో పనిచేసేవాడు శరవణన్. దాంతో చిన్నప్పటినుంచీ రాజేశ్వరికీ అబ్దుల్లా కుటుంబంతో చనువుండేది. రాజేశ్వరి తల్లిలేని పిల్ల. తండ్రితో రోజూ అబ్దుల్లా వాళ్లింటికి రావడం.. అక్కడే అతని పిల్లలతో ఆడుకోవడం చేస్తూండేది. ఈ క్రమంలో శరవణన్ కూడా అనారోగ్యం బారినపడి.. కన్నుమూశాడు. అప్పటికి రాజేశ్వరి వయసు ఏడేళ్లు. అనాథ అయిన ఆ అమ్మాయిని అబ్దుల్లా కుటుంబం అక్కున చేర్చుకుంది. తమ ముగ్గురు కొడుకులతోపాటు రాజేశ్వరినీ పెంచింది. ఇప్పుడు రాజేశ్వరికి ఇరవై రెండేళ్లు. ఆ ఊరికే చెందిన విష్ణు అనే అబ్బాయి రాజేశ్వరిని ఇష్టపడ్డాడు. ఈ విషయం అబ్దుల్లా వాళ్లింట్లో తెలిసి పెళ్లి విషయం మాట్లాడ్డానికి అబ్బాయి వాళ్లింటికి వెళ్లాడు అబ్దుల్లా తన భార్యను తీసుకొని. ఆ ఇంటి వియ్యం అందుకోడానికి విష్ణు తల్లిదండ్రులు జయంతి, బాలచంద్రన్ సంతోషంగా ఒప్పుకున్నారు. కాని పెళ్లి గుడిలోనే జరగాలనే ఒక షరతుతో. ‘దానికేముంది తప్పకుండా’ అని వియ్యాల వారి కోరికను మన్నించారు అబ్దుల్లా అండ్ ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాలు కలిసి.. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండే గుడి కోసం వెదికి.. చివరకు కసరగాడ్ లోని మన్యొట్టు దేవాలయాన్ని ఓకే చేసుకున్నారు. ఆ గుడిలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంటుంది. పెళ్లిరోజు అమ్మాయి వాళ్లకన్నా ముందే అబ్బాయి వాళ్లు ఆ గుడికి చేరుకుని.. పెళ్లి కూతురి తరపు వాళ్లకు స్వాగతం పలికారు. ఆలయం లోపల.. వేడుక జరిగే చోట .. కాస్త దూరంగా నిలబడి చూస్తున్న అబ్దుల్లా కుటుంబాన్ని చేయిపట్టుకొని మరీ తీసుకొచ్చి అమ్మాయి పక్కన నిలబెట్టారు విష్ణు తల్లిదండ్రులు. ఈ పెళ్లికి అబ్దుల్లా తల్లి .. 84 ఏళ్ల సఫియుమ్మతో సహా అబ్దుల్లా బంధువులంతా హాజరయ్యారు. ఇదీ రాజేశ్వరీ పరిణయకథ. -
అఫ్గానిస్తాన్ పగ్గాలు మళ్లీ ఘనీకే !
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ మళ్లీ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదివారం ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఘనీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. అష్రాఫ్ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ ఎన్నికల కమిషన్ (ఈఏసీ) తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. సెప్టెంబర్ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థులు ఈఏసీ సక్రమ మైన పనితీరును కనబరచలేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి అంటోంది. జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది. కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇక వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం అధ్యక్షురాలు హవా అలామ్ నురిస్తానీ తమకు అప్పగించిన బాధ్యతను నీతి, నిజాయితీ , చిత్తశుద్ధితో నిర్వహించామన్నారు. ఫలితాలు పారదర్శకంగా లేవు: అబ్దుల్లా ఎన్నికల ఫలితాలు వెలువడగానే అబ్దుల్లా కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో..‘మాకు ఓటు వేసిన ప్రజలకి, మద్దతుదారులకి, ఎన్నికల సంఘానికి, అంతర్జాతీయ మిత్రులకి మేం ఒకటే చెబుదామనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాల్ని మేం అంగీకరించడం లేదు. చట్టపరంగా మేం చేస్తున్న డిమాండ్లు తీర్చాల్సి ఉంది’’అని ఉంది. -
కశ్మీర్‌లోనూ బాసిత్ నెట్వర్క్!
సాక్షి, హైదబాద్: ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, నగరానికి చెందిన అబ్దుల్లా బాసిత్‌కు కశ్మీర్‌లోనూ నెట్వర్క్ ఉంది. అతడు మరికొందరితో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ, కశ్మీర్(జేకేఐఎస్) ఏర్పాటు చేశాడు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత నెల 7న పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బాసిత్‌ను ఈ కోణంలోనూ విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కేసులో ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ అధికారులు ఆగస్టు 12న బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే. ఆది నుంచి ఉగ్రభావాలతోనే... చాంద్రాయణగుట్ట, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్(సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఆకర్షితుడై ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో బాసిత్ 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలిసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘనిస్తాన్కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశాడు. బంగ్లాదేశ్ చేరుకోవడం కోసం కోల్‌కతా వరకు వెళ్లిన వీరిని అక్కడ పోలీసులు పట్టుకుని నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం వీరిని విడిచిపెట్టారు. కాలేజీలో సీటు కోల్పోవడంతో అతను హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. అప్పటికీ తమ పంథా మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్ ఐసిస్‌లో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీవోకే వెళ్లాలని వీరు పథకం వేశారు. 2015 డిసెంబర్ 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ పంథా మార్చుకోని బాసిత్ విదేశాలతోపాటు ఢిల్లీ, కశ్మీర్‌ల్లో ఉన్న ఐసిస్ నేతలతో సంబంధాలు కొనసాగించాడు. సోషల్‌మీడియా యాప్స్ థ్రీమా, టెలిగ్రాం యాప్స్ ద్వారా సంప్రదింపులు చేసేవాడు. కశ్మీర్ ‘ప్రత్యేకం’కావాలని... భవిష్యత్తులో కశ్మీర్ భారత్ నుంచి వేరేపడినా అది పాకిస్తాన్లో భాగం కాకుండా ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో జేకేఐఎస్ ఏర్పాటు చేశారు. దీనిలో బాసిత్‌తోపాటు కశ్మీర్‌కు చెందిన లోన్, ఉత్తరప్రదేశ్‌లోని గజ్‌రోలాకు చెందిన పర్వేజ్, జంషీద్తోపాటు మరో నలుగురు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న కశ్మీర్‌కు వెళ్లి లోన్ అనే ఉగ్రవాది వద్ద ఆశ్ర యం తీసుకుని జేకేఐఎస్ విస్తరణపై చర్చించాడు. కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత నెల 7న ఢిల్లీలోని జామామసీదు బస్టాండ్‌లో పర్వేజ్, జంషీద్లను అరెస్టు చేశారు. వీరి విచారణ నేపథ్యంలో బాసిత్‌కు ఉన్న కశ్మీర్ లింకు, నెట్వర్క్ బయటపడ్డాయి. ఆన్లైన్లో ఎక్కువమందిని ఆకర్షించలేకపోయిన నేపథ్యంలోనే జేకేఐఎస్ పూర్తిస్థాయి ఆపరేషన్లు ప్రారంభించలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అరెస్టైనా శుభాకాంక్షలు... అబ్దుల్లా బాసిత్ ఫేస్బుక్లో తన పేరుతోనే ఓ పేజ్ కలిగి ఉన్నాడు. వీరిలో అనేక మందికి బాసిత్ అరెస్టు విషయం తెలియకపోవడమో, తెలిసినా పట్టించుకోకపోవడందో బాసిత్ పుట్టిన రోజు నేపథ్యంలో గత నెల 2న (సెప్టెంబర్) అతడి టైమ్‌లైన్‌పై అనేకమంది బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టింగ్స్ చేశారు. -
పాక్ కెప్టెన్ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్
-
పాక్ కెప్టెన్ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్
సాధారణంగా క్రీడలంటేనే సరిహద్దులు లేనివి.. హద్దులకు మించినవి. పోటీ మైదానానికే వదిలేయాలి తప్ప వ్యక్తిగతంగా మోసుకురావొద్దు.. అభిప్రాయ బేధాలు ఉంటే వ్యవస్థకు అపాధించాలే తప్ప వ్యక్తులపై రుద్దొద్దు. సరిగ్గా అదే అంశాన్ని రూఢీ చేసేలా ఇప్పుడు ఓ ఛాయా చిత్రం ఆన్లైన్లో తెగ హల్ చల్ చేస్తోంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యంత అరుదైన ఫొటోను నెట్లో పంచుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నదే ఆ ఫొటో. ఆదివారం దాయాది పాక్, భారత్‌కు మధ్య ఉత్కంఠ భరిత స్థాయిలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనున్న విషయం తెలిసిందే. సాధారణంగా పాక్, ఇండియా మ్యాచ్ అంటేనే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట ముగిసినా వారంపాటు దాని ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోనీ పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇరు దేశాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఇలాగే ఉంటే బావుంటుందంటూ వారు కోరుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఓసారి పాక్‌ను ఓడించిన భారత్ ఫైనల్లో కూడా విజయ దుందుభి మోగిస్తామనే ధీమాతో ఉంది. -
శోకసంద్రం
ఎస్సారెస్పీ కాలువలో బాలుడి గల్లంతు ఆస్పత్రిలో శిశువు కన్నుమూత శోకసంద్రంలో కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ఇద్దరు తల్లులకు కడుపుకోతను మిగిల్చింది. పట్టణశివారు చల్గల్కు చెందిన అబ్దుల్లా (14) ఈతకు వెళ్లి నీటమునిగి చనిపోగా.. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో పురిట్లోనే ఓ శిశువు కన్నుమూసింది. ఈ రెండు సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. – జగిత్యాల రూరల్ -
భర్త తాగి వస్తున్నాడని..
భర్త రోజు మద్యం తాగి వస్తున్నాడని మనస్తాపానికి గురైన భార్య వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్లా, మస్తాన్‌బీ(26)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మద్యానికి బానిసైన భర్త రోజు తాగి వచ్చి వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన మస్తాన్‌బీ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిపోయింది. ఇది గుర్తించిన గ్రామస్థులు ఆమెను చికిత్స నిమిత్తం దర్శి ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని వైద్యులు సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఏర్పాటు పై 'ఫరూక్ అబ్దుల్లా'
-
ఆ నేడు 25 సెప్టెంబర్, 2011
ఓటుకు పోదాం ఛలో ఛలో! మహిళలకు ఓటు హక్కు కల్పిస్తున్నట్లు సౌదీ అరేబియ రాజు అబ్దుల్లా ప్రకటించారు. కరడు గట్టిన ఒక సంప్రదాయ రాజ్యంలో ఇది చారిత్రక ఘట్టమే. ఓటు హక్కు మాత్రమే కాదు ‘షుర కౌన్సిల్’ (సంప్రదింపుల సభ)లో కూడా మహిళలు భాగస్వాములు కావాలని 87 ఏళ్ల అబ్దుల్లా పిలుపునిచ్చారు. తన చర్యను ‘జాగ్రత్తతో కూడిన సంస్కరణ’ అన్నారు ఆయన. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడాలని అబ్దుల్లా సౌదీ మహిళలను కోరారు. అబ్దుల్లా ప్రకటనపై దేశంలో చాలా మంది సానుకూలంగా స్పందించడం విశేషం. ‘‘మహిళలకు సంబంధించి దేశంలో అనుకూల మార్పులు తీసుకురావడానికి ఇదొక లిట్మస్ టెస్ట్లాంటిది’’ అన్నారు సామాజిక విశ్లేషకులు. ‘‘ఇది కంటితుడుపు చర్య..పాశ్చాత్యదేశాల మెప్పుకోసం వేసిన పిల్లి మొగ్గ’’ అన్నవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ ఓటుహక్కు అనేది తొలి అడుగు అనుకోవచ్చు. -
యువరాజు ఔదార్యం
సామాజిక సేవకు సౌదీ ప్రిన్స్ రూ. 2 లక్షల కోట్ల దానం రియాద్: సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన రూ. 2 లక్షల కోట్ల సంపదను సమాజసేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ప్రజాసేవ కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం సమాజ అభివృద్ధికి, మహిళల సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి, విపత్తు సహాయానికి ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించి చారిటీ ప్రాజెక్టుల ద్వారా ఈ నిధులను వినియోగిస్తామని, ట్రస్టుల బోర్డుకు తాను చైర్మన్‌గా ఉంటానని తెలిపారు. అమెరికాలోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరహాలో తన చారిటీ ట్రస్ట్ పని చేస్తుందని వెల్లడించారు. అల్వలీద్కు ప్రభుత్వ పదవి ఏదీ లేదు. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కింగ్డమ్ హోల్డింగ్ కంపెనీ యాజమాన్య వాటా కాకుండా ఇతరత్రా ఉన్న సంపదను మాత్రమే ఈ చారిటీకి అప్పగిస్తున్నారు. అల్వలీద్ గత జనవరిలో చనిపోయిన సౌదీరాజు అబ్దుల్లాకు సమీప బంధువు. -
సౌదీ అరేబియా రాజు కన్నుమూత
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా(90) కన్నుమూశారు. అబ్దుల్లా శుక్రవారం ఒంటి గంటకు (స్థానిక కాలమాన ప్రకారం) మరణించారని సౌదీ అరేబియా రక్షణ మంత్రి సల్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుగా దివంగత అబ్దుల్లా తమ్ముడు మోక్రేన్ కు బాధ్యతలు అప్పచెబుతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత అబ్దుల్లా సంస్మరణార్ధం రాయల్ ప్యాలెస్ లో నిర్వహించే ప్రార్థనలకు దేశ ప్రజలందరినీ ఆహ్వానించారు. అనంతరం అబ్దుల్లా అంత్యక్రియలు జరగనున్నాయి. గత డిసెంబర్ లో అబ్దుల్లా న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు గొట్టాల ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఆయన 2005లో సౌదీ అరేబియా రాజుగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఈ మధ్యే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన మారణకాండకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో చేరారు. ఆయన మరణానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. -
అమ్మ మనసంటే అదేనేమో!
ఆదర్శం క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం లేదంటారు. తప్పు చేసిన వాడిని క్షమించమని మహా పురుషులు ఎందరో కూడా సెలవిచ్చారు. అయినా మనిషి భావోద్వేగాల ముందు క్షమాగుణం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. మనల్ని బాధపెట్టినవారిని క్షమించి వదిలేద్దామంటే మనసు ఎదురు తిరుగుతుంది. నీ బాధ అవతలివారిని కూడా రుచి చూడనివ్వమంటూ పోరు పెడుతుంది. కానీ ఆ తల్లి విషయంలో అలా జరగలేదు. తన కొడుకుని చంపినవాడిని సైతం ఆమె క్షమించింది. క్షమాగుణానికి, తల్లి మనసుకి మారుపేరుగా నిలిచింది. ఏడేళ్ల క్రితం ఇరాన్‌లోని మజాందరన్ ప్రావిన్‌సలో అబ్దుల్లా అనే యువకుడిని నడిరోడ్డు మీద పొడిచి చంపాడు బలాల్ అనే వ్యక్తి. విచారణలు, వాదోపవాదాలు జరిగిన తరువాత అతడిని బహిరంగంగా ఉరి తీయమని న్యాయస్థానం ఆదేశించింది. ఎట్టకేలకు అతడిని ఉరితీసే సమయం ఆసన్నమయ్యింది. పోలీసులు బలాల్ని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఉరికొయ్య వద్ద అతడిని నిలబెట్టారు. కళ్లకు గంతలు కట్టారు. మెడకు ఉరి బిగించారు. కొద్ది క్షణాల్లో అతడిని ఉరి తీసేవారే. కానీ అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన! జరిగేది చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఓ మహిళ ముందుకు వచ్చింది. ఉరికొయ్య దగ్గరకు వెళ్లి ఓ కుర్చీ కావాలని పోలీసును అడిగింది. అతడు కుర్చీ ఇచ్చాక, దాని మీదకు ఎక్కి బలాల్ని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టింది. ‘‘నిన్ను క్షమించాను’’ అనేసి వెళ్లిపోయింది. ఆమె ఎవరో కాదు... బలాల్ చేతిలో హత్యకు గురైన అబ్దుల్లా తల్లి మర్యామ్. కొద్ది రోజుల క్రితం అబ్దుల్లా కలలో కనిపించి, ‘నేను బాగున్నాను, నువ్వు బాధపడొద్దు’ అని తల్లితో చెప్పాడట. దాంతో ఆమె బలాల్ని క్షమించింది. అతడిని చంపొద్దు, వదిలేయమంటూ అధికారులను కోరింది. బిడ్డను కోల్పోయి తాను అనుభవించిన కడుపుకోత మరో తల్లికి కలగకూడదని ఆశించింది. తల్లి మనసంటే ఏంటో చూపించింది. మనల్ని బాధపెట్టినవాళ్లని క్షమించాలంటే గొప్ప మనసుండాలి. ఆ మనసు మర్యామ్కి ఉంది. ఆమెకి హ్యాట్సాఫ్! -
అబ్దుల్లాకు ‘ఆంధ్రకేసరి’ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ టోర్నీలో ఆంధ్రకేసరి (84-130 కేజీల) డిఫెండింగ్ చాంపియన్ హబీబ్ అబ్దుల్లా జిలానీ (బామాస్ అఖాడా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో హబీబ్ అబ్దుల్లా... మహ్మద్ (నూరాని తాలీమ్)పై విజయం సాధించాడు. మహ్మద్ సమద్ తబ్రేజ్ (మౌలబాన్ ఉస్తాద్), మహ్మద్ అస్లీమ్ (సమద్ ఉస్తాద్)లు మూడో స్థానం పొందారు. విజేతకు సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గదను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ ఫలితాలు: 55 కేజీలు: 1. టి.కృష్ణ సింగ్ (రహీంపురా పీజీ), 2. సంజయ్ కుమార్ (సురేష్ పహిల్వాన్), 3. ఇ. శివాజీ (నిజామాబాద్), 3. విజయ్ కుమార్ (విక్టరీ ప్లేగ్రౌండ్స్). 60 కేజీలు: 1. టి.దేవీ సింగ్ (లాలా తలీమ్), 2. వినయ్ కుమార్ (ఆర్పీసీ), 3. డి.సందీప్(జై భవానీ వ్యాయామశాల), 3. చంద్రన్ సింగ్ (లాలా తలీమ్). 66 కేజీలు: దినేష్ (శ్రీరామ్ వ్యాయామశాల), 2. జి.అశ్విన్ (శ్రీరామ్ వ్యాయామశాల), 3. అబూ బకర్ (బిన్ ఖలీఫా అఖాడా). 74 కేజీలు: 1. జాఫర్బిన్ ముబారక్ (ఖులీఖ్ ఉస్తాద్), 2. మహ్మద్ జునైద్ ఖలీద్, 3. సి.గజేంద్ర (జ్ఞానేశ్వర్ ఉస్తాద్), 3. జి.నితీష్ యాదవ్ (హైదరాబాద్ డీసీసీ). 84 కేజీలు: 1. ఒమర్ బిన్ జావిద్ (అలీ ఉస్తాద్), 2. మహ్మద్ హబీబ్ ఖాన్ (బామాస్ అఖాడా). 3. మహ్మద్ అబ్దుల్ సుల్తాన్ (బామాస్ అఖాడా), 3.అబ్దుల్ రహీమ్ (బామాస్ అకాడమీ). 84-120 కేజీలు:1.జి.శ్రీనాథ్ యాదవ్ (శ్రీను పహిల్వాన్), 2. ఇమ్రాన్ (అలీ వస్తాద్), 3. అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది (సలామ్ పహిల్వాన్). 3.శాంతి కుమార్ (అడవయ్య ఉస్తాద్). -
పెళ్లి సంబంధం పేరుతో నయావంచన
= సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్న కేటుగాడు =నిందితుడి అరెస్టు.. 85 సెల్ఫోన్లు స్వాధీనం నాంపల్లి, న్యూస్‌లైన్: పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని పిలిచి.. సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు 85 వివిధ రకాల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పశ్చిమ మండలం డీసీపీ జీపీ వినోద్‌కుమార్, టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్‌తో కలిసి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సాధిక్ అలియాస్ సాజిత్ అలియాస్ అబ్దుల్లా(38) వృత్తిరీత్యా డ్రైవర్. మహారాష్ట్రలో కూడా పలు పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసులున్నాయి. మహారాష్ట్ర జరిగిలో మతఘర్షణల్లో ఇతను నిందితుడు. ఇదే క్రమంలో ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహ్మద్ సాధిక్ ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకుని నగరంలోనే జీవిస్తున్నాడు. జైలుకు వెళ్లి వచ్చినా నేరాలు చేయడం మానుకోలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించేందుకు సాధిక్ ఓ పథకం పన్నాడు. ఉర్దూ దినపత్రికల్లో వచ్చే పెళ్లి సంబంధాల క్లాసిఫైడ్స్‌ను చదివి... అందులో ఉన్న ‘వరుడు కావలెను’ అనే క్లాసిఫైడ్‌లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేసేవాడు. తాను యూకే నుంచి వచ్చానని, తన కుమారుడు మెడిసన్ చదువుతున్నాడని, సంబంధం కోసం మీతో మాట్లాడాలని చెప్పేవాడు. మరికొందరిని తాను మహ్మద్ ఖాన్ జువెలర్స్ యజమాని స్నేహితుడినని ఫోన్ చేసి పరిచయం చేసుకొనేవాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు వచ్చిన వారిని సమీపంలోని ఏదైన మసీదుకు వద్దకు రప్పించేవాడు. ప్రార్థనలకు సమయం అవుతోందని, పార్థన చేసుకొని వచ్చి మాట్లాడుకుందామని చెప్పేవాడు. స్నేహితుడికి ఫోన్ చేయాలని, సెల్‌ఫోన్ నెట్వర్క్ పని చేయడంలేదని, మీ ఫోన్ ఇస్తే బయటకు వెళ్లి మాట్లాడతానని తీసుకొనేవాడు. ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేవాడు. ఇలా గత నాలుగు నెలల్లో వంద మందికి టోకరా ఇచ్చాడు. బాధితుల్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇదే క్రమంలో అహ్మద్ సల్మాన్ అనే న్యాయవాదికి చెందిన ఖరీదైన ఫోన్ తీసుకొని ఉడాయించాడు. సదరు న్యాయవాది టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాధిక్‌ను అరెస్టు చేశారు. సాధిక్ చేతిలో మోసపోయిన బాధితులు తమ సెల్‌ఫోన్ ఆధారాలను టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో చూపించి.. పోయిన తమ సెల్‌ఫోన్‌ను పొందవచ్చని డీసీపీ తెలిపారు. ఓ కేసు విషయంలో తాను రౌడీషీటర్ కౌసర్నని, రాజీ చేస్తానని ఓ వ్యక్తి వద్ద నుంచి సాధిక్ రూ.10 లక్షలు దండుకున్నట్టు తెలిసింది.