ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల ఓవరాల్ టీమ్ టైటిల్‌ను గగన్‌మహల్ ఆంధ్రా విద్యాలయం (ఏవీ) కాలేజి చేజిక్కించుకుంది. సిగ్నోడియా కాలేజి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్‌లో శనివారం ఈ పోటీలు జరిగాయి.
ఏవీ కాలేజీకి చెందిన నలుగురు లిఫ్టర్లు తమ వెయిట్ కేటగిరీల్లో సత్తా చాటి స్వర్ణ పతకాలను గెల్చుకోవడంతోపాటు తమ కాలేజి జట్టుకు టీమ్ టైటిల్‌ను అందించారు. వెస్లీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా, ప్రజావాలా కాలేజి, హస్విత కాలేజి, సెయింట్ జోసెఫ్ కాలేజి జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.
ఫైనల్స్ ఫలితాలు
59 కేజీలు: 1.జి.రమేష్ (ఏవీ కాలేజి), 2.ఆనంద్ కుమార్ సింగ్ (టీకేఆర్ కాలేజి), 3.కె.దినేష్ (ఐఐఎంసీ). 66 కేజీలు: 1.ఎం.జానకీరామ్ (ఏవీ కాలేజి), 2.కె.వినోద్ కుమార్ (వి.స్వామి కాలేజి), 3.ఎం.ఓం ప్రసాద్ (శ్రీవిజ్ఞాన్ కాలేజి).
74 కేజీలు: 1.ఎన్.అంజయ్య (ప్రజావాలా కాలేజి), 2.ఎం.అమరనాథ్ యాదవ్ (పీజీ కాలేజి), 3.యుశంధర్ గౌడ్ (వెస్లీ కాలేజి). 83 కేజీలు: 1.ఎం.బి.అబిద్ ( వెస్లీ కాలేజి), 2.ఎల్.ప్రవీణ్ కుమార్ (శ్రీవిజ్ఞాన్ కాలేజి), 3.ఎస్.కృష్ణ (నిజాం కాలేజి). 93 కేజీలు: 1.అమర్ సింగ్ (హస్విత కాలేజి), 2. టి.ఆర్.సి.క్రాంతి(కేన్ కాలేజి), 3.నితిన్ కుమార్ (సుప్రభాత్ కాలేజి). 105 కేజీలు: 1.వై.రాఘవేందర్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ కాలేజి), 2.ఆర్.గణేష్ యాదవ్ (సుప్రభాత్ కాలేజి), 3.ఆర్.సాయి కుమార్ (వెస్లీ కాలేజి). 120 కేజీలు: 1.పర్వానంద్ (లయోలా అకాడ మీ). మహిళల విభాగం 84 కేజీలు: 1.డి.అనూష గౌడ్ (ఏవీ కాలేజి).
ఏవీ కాలేజీకి పవర్‌లిఫ్టింగ్ టైటిల్
Published Sun, Jan 19 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement