జీవీకే-ఏఐటీఏ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 65+ పురుషుల సింగిల్స్‌లో ఆర్.ఐ.సింగ్, టి.శ్రీధర్‌లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీవీకే-ఏఐటీఏ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 65+ పురుషుల సింగిల్స్‌లో ఆర్.ఐ.సింగ్, టి.శ్రీధర్‌లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. అలాగే మదన్ మోహన్ సింగ్, వి.ఆర్.కులకర్ణి సెమీఫైనల్లోకి చేరారు. రాష్ట్ర సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈపోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన 65+ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆర్.ఐ.సింగ్ 6-2, 6-2స్కోరుతో కె.కె.అరవింద్‌పై విజయం సాధించారు. ఇతర క్వార్టర్ ఫైనల్లో టి.శ్రీధర్ 6-1, 6-2 స్కోరుతో సత్యమోహన్‌పై, మదన్ మోహన్ సింగ్ 6-2,6-0తో శ్యామ్ గైక్వాడ్‌పై, వి.ఆర్.కులకర్ణి 6-4, 6-4తో సి.రాధాకృష్ణపై గెలుపొందారు.
క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలు:
55+ సింగిల్స్: ఆర్.ఈ.సుదర్శన్‌రావు 7-6, 7-3,6-0తో కమల్ తాపాపై, ఎం.సురేష్ 6-2, 7-5తో డాక్టర్ రాంమోహన్‌రావుపై, ఎస్.సేతు 6-2,6-1తో తులసీరామ్‌పై, యోగేష్ 6-2, 6-0తో పి.కె.కిషోర్‌పై గెలిచారు.
45+ సింగిల్స్: ఆర్.నాగరాజ్ 6-2, 6-3తో కె.మెహర్ ప్రకాష్‌పై, ఎస్.నరేంద్రనాథ్ 6-0, 6-1తో సతీష్‌రెడ్డిపై, వి.శంకర్ 6-1, 6-2తో జి.అప్పలరాజుపై, కె.ఆర్.అనిల్ కుమార్ 7-5, 6-4తో ఆర్.ఎన్.రమేష్‌పై నెగ్గారు.
45+ డబుల్స్ రెండో రౌండ్స్ ఫలితాలు: కె.మెహర్ ప్రకాష్- ఆర్.నాగరాజ్ జోడి 6-3, 6-1తో ఎ.ఎస్.ఖాన్- ఎన్.ఎస్.బాలాజి జోడిపై, ఆలీ సాజిద్- ఆర్.ఎన్.రమేష్ జోడి 6-2, 4-6, 6-4తో ఎం.ఎస్.శ్రీధర్- సి.హెచ్.వి.పాండురంగారావు జోడిపై, పాల్ మనోహర్- జయంత్ పవార్ జోడి 6-1, 6-1తో విశ్వనాథ్ రాము- మేఘనాథన్ జోడిపై, ఎస్.నరేంద్రనాథ్- సి.వి.ఆనంద్ జోడి 4-6, 6-2, 6-3తో ఆర్.వి.రామారాజు- సతీష్‌రెడ్డి జోడిపై నెగ్గాయి.