రన్నరప్ ఉస్మానియా | in hand ball tournment osmania university in runner-up place | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఉస్మానియా

Published Sun, Nov 24 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

in hand ball tournment osmania university in runner-up place

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా ఉస్మానియా యూని వర్సిటీ(ఓయూ) జట్టు నిలిచింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీ ఫైన ల్లో ఓయూ జట్టు 27-25 స్కోరుతో కాకతీయ యూనివర్సిటీ జట్టు చేతిలో ఓడింది. ఓయూ తరఫున రాజ్‌కుమార్, శక్తి యాదవ్‌లు రాణిం చారు. ఈ టోర్నీలో ఓయూ మహిళల జట్టుకు మూడో స్థానం లభించిన విషయం తెలిసిందే.
 
 ఓయూ మహిళల హాకీ కెప్టెన్‌గా భవాని
 సెంట్రల్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ మహిళల జట్టుకు భవాని సారథ్యం వహించనుంది. ఈ పోటీలు ఈనెల 26 నుంచి డిసెంబరు 1 వరకు రూర్కెలాలో జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఓయూ జట్టును ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటించారు.

 జట్టు: భవాని(కెప్టెన్), చిన్ని, వైష్ణవి, గంగా జమున, నజియా బేగం, రేఖ, ఇ.బబిత , కవిత, శ్రావణి, మోనిక, పావని, అనూష, జ్యోత్స్న, సుప్రజ, ఎం.జ్యోతి, బి.అరుణ. మనోహర్(కోచ్), డాక్టర్ ఐ.బలరామ్ రెడ్డి(మేనేజర్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement