ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జిల్లాలోని బాసరలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 16-21 స్కోరుతో వరంగల్ జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు 29-24తో గుంటూరు జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో చక్కటి నైపుణ్యాన్ని కనబర్చిన హైదరాబాద్ ఆటగాళ్లు రాజ్ కుమార్, శక్తి యాదవ్‌లకు రాష్ట్ర జట్టులో చోటు దక్కింది. జాతీయ సీనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీ ఈనెల 10 నుంచి బీలాస్‌పూర్‌లో జరుగనుంది.
హ్యాండ్‌బాల్ టోర్నీలో రన్నరప్‌గా హైదరాబాద్
Published Fri, Dec 6 2013 12:19 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement