హరికృష్ణ
సూర్యాపేట: గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ కాంట్రాక్టు వైద్య ఉద్యోగికి వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా పెంచికలదిన్నె పీహెచ్‌సీ లో హరికృష్ణ అనే వ్యక్తి హెల్త్ అసిస్టెంట్‌గా 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కంటి వెలుగు–2 విధి నిర్వహణలో ఉండగా శుక్రవారం హరికృష్ణ గుండెపోటుకు గురయ్యారు. తోటి సిబ్బంది హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. వైద్యశాఖలో పనిచేస్తున్న హరికృష్ణకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించకపోవడం, చాలీచాలని జీతం, పేదరికం కారణంగా వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు కూడా లేకపోవడంతో ఈ విషయాన్ని ఉద్యోగుల యూనియన్ (హెచ్1) మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన మంత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో హరికృష్ణకు నగదురహిత వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment