చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ వేసేలా చూస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టును ఆమె సందర్శించారు. కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి మొక్క నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కోర్టులో అదనంగా రెండు ఫ్లోర్లు నిర్మించాలని, సిబ్బందిని నియమించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న 7 వేల కేసుల పరిష్కారానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, లేబర్ కోర్టును మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొండ్రాల అశోక్ పోర్టుఫోలియో కోరారు.
న్యాయమూర్తి స్పందిస్తూ, సూర్యాపేట జిల్లా కోర్టుకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రధాన న్యాయమూర్తి తన దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, హుజూర్‌నగర్ సీనియర్ సివిల్ జడ్జి కె.శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు కామిశెట్టి సురేశ్, జె.ప్రశాంతి, శ్యాంసుందర్, మారుతి ప్రసాద్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలేబోయిన నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment