వధూవరులను ఆశీర్వదిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు
సూర్యాపేట: నిత్యం ప్రభుత్వ పరిపాలనలో బిజీ గా ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఓ పేద యువతికి అన్నీ తానై వివాహం జరిపించారు. ఇంటికి పెద్ద దిక్కు ను కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలిచి దాతృత్వాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నంద్యాలగూడెం గ్రామానికి చెందిన నంద్యాల వెంకట్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లో చిరుద్యోగం చేసుకుంటూ తండ్రి, భార్యాబిడ్డలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మూ డు నెలల కిందట వెంకట్‌రెడ్డి తన పెద్ద కుమార్తె శ్రావ్యకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నా రు. తెల్లవారితే నిశ్చితార్థం ఉండడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి తండ్రి సత్తిరెడ్డి కన్నుమూశారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక వెంకట్‌రెడ్డి గుండె కూడా ఆగిపోయింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా కారుచీకట్లు కమ్ముకున్నాయి.
ఆపద్బాంధవుడిగా..
సత్తిరెడ్డి, వెంకట్‌రెడ్డి మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ ఆ కుటుంబం గురించి తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి నంద్యాలగూడెం చేరుకుని ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వారిని పరామర్శించి.. ఆగిపోయిన వెంకట్‌రెడ్డి పెద్ద కూతురు శ్రావ్య వివాహం తానే జరిపిస్తానని హామీ ఇచ్చారు.
అన్నీ తానై..
ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఉదయం 9:30 గంటలకు వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రావ్య వివాహాన్ని మంత్రి దంపతులు దగ్గరుండి వైభవంగా జరిపించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు అండగా నిలవడంతో నంద్యాల గూడెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్ద దిక్కుగా ఉండి పెళ్లి చేశారు
ఇటీవల మా తాత చనిపోగా మా నాన్న దానిని తట్టుకోలేక గుండె పోటుతో మృతిచెందారు. ఆ సమయంలో మమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన మంత్రి.. నా పెళ్లి బాధ్యత తీసుకుంటామన్నారు. అన్నట్టుగానే ఇంటికి పెద్ద దిక్కుగా మారి దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. చాలా సంతోషంగా ఉంది.
– శ్రావ్య, పెళ్లి కుమార్తె
Comments
Please login to add a commentAdd a comment