
సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి): సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకుడే నయవంచకుడిగా మారాడు. తాను బోధిస్తున్న కళాశాల విద్యార్థినిని ప్రేమపేరుతో వంచించాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికి కాటేశాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ బి.డానియల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఇదే కాలేజీకి చెందిన గణిత అధ్యాపకుడు లింగయ్య ప్రేమిస్తున్నానని కళాశాలప్రారంభంనుంచే విద్యార్థినిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ చదువు మాన్పిస్తారేమోనని భయపడి ఊరుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఈ అధ్యాపకుడికి గతంలోనే వివాహం జరిగింది. ఈ నెల 21వ తేదీన విద్యార్థినిని తన సొంత వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి మళ్లీ లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment